RC 16 .. చరణ్‌ని ధీటుగా ఢీకొట్టే మొనగాడు
రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామాలో అతడిని ఢీకొట్టేందుకు ఓ ఛాలెంజింగ్ నటుడిని బుచ్చిబాబు ఎంపిక చేసారని, అతడు కూడా టీమ్ తో జాయినవుతున్నాడని కథనాలొస్తున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ తో `గేమ్ ఛేంజర్` చిత్రీకరణను పూర్తి చేసి తదుపరి బుచ్చిబాబు సనా చిత్రంలోను నటిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు.. మైసూరులో ఈ ప్రాజెక్ట్ మీనీ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసారు. కర్ణాటక- మైసూరులో కీలక సన్నివేశాలను చిత్రీకరణను ముగించి, తదుపరి హైదరాబాద్ బూత్ బంగ్లాకు షెడ్యూల్ ని షిఫ్ట్ చేసారని తెలుస్తోంది.
మేకర్స్ మైసూరులో కీలకమైన కానీ చిన్న షెడ్యూల్‌ను ముగించారు. ఇందులో బుచ్చి బాబు సనా రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ , సత్యలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే షెడ్యూల్ లో మేకర్స్ హైదరాబాద్ భూత్ బంగ్లాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం దీని కోసం సెట్‌ను నిర్మిస్తున్నారు.
రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామాలో అతడిని ఢీకొట్టేందుకు ఓ ఛాలెంజింగ్ నటుడిని బుచ్చిబాబు ఎంపిక చేసారని, అతడు కూడా టీమ్ తో జాయినవుతున్నాడని కథనాలొస్తున్నాయి. అతడి పాత్ర కథలో కీలక మలుపునిస్తుందని సమాచారం. అయితే ఈ ప్రతిభావంతుడైన స్టార్ ఎవరు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తోంది.
రెహమాన్ లేనట్టేనా?
ఆసక్తికరంగా రామ్ చరణ్- బుచ్చిబాబు చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ ని ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. స్పోర్ట్స్ డ్రామాకు రెహమాన్ సంగీతం జీవం పోస్తుందని ఆశించారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఆస్కార్ గ్రహీత రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం సాగుతోంది. రెహమాన్ స్థానంలో సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు ఇప్పుడు దేవీశ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.