బుచ్చిబాబు ది బెస్ట్ తీసుకున్నాడా?
ఈ విషయంలో బుచ్చి బాబు ఎంతో లక్కీ అనే అనాలి.
మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్ తో పనిచేసే అరుదైన అవకాశం యువ దర్శకుడు బుచ్చిబాబు కి రెండవ సినిమా తోనే సాధ్యమైంది. ఈ విషయంలో బుచ్చి బాబు ఎంతో లక్కీ అనే అనాలి. రెహమాన్ తో పనిచేయాలని ఎంతో మంది దర్శకులు క్యూలో ఉంటారు. కానీ వాళ్లని సైతం బుచ్చి వెనక్కి నెట్టి అవకాశం అందుకోవడం గొప్ప విషయం. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పరోక్ష కారకులుగా చెప్పొచ్చు. ఆయన కథానాయకుడిగా నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాకి రెహమాన్ సంగీతం అందించాలి.
కానీ అప్పుడు అనివార్య కారణలతో మధ్యలోనే డ్రాప్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తనయుడు చరణ్ తో వచ్చిన అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకోవాలని రెహమాన్ అంతే ఆసక్తిగా ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. సినిమా ప్రారంభోత్సవం రోజున కూడా హైదరాబాద్ వచ్చి విషెస్ చెప్పి వెళ్లారు. ఇంతవరకూ అంతా బాగానే మంది. మరి రెహమాన్ నుంచి బుచ్చి బాబు ఎంతవరకూ ది బెస్ట్ మ్యూజిక్ తీసుకున్నాడు? అన్నది ఆసక్తికరం.
రెహమాన్ తో పనిచేయడం అంటే కొన్ని రకాల ఇబ్బందులుంటాయని గతంలో పనిచేసిన రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లు హెచ్చరించిన సందర్భం ఉంది. ట్యూన్స్ త్వరగా ఇవ్వరని..ఎక్కువ సమయం తీసుకుంటారనే ఆరోపణ ఉంది. మరి బుచ్చిబాబు ఈ రకమైన పరిస్థితిని ఎలా అధిగమిస్తున్నాడు? అన్నది చూడాలి. జూన్ నుంచి సినిమా సెట్స్ కి వెళ్తుంది. మరి ట్యూన్స్ అన్నీ సిద్దమయ్యాయా? పాటల కంపోజింగ్ పూర్తయిందా? వాటిలో ది బెస్ట్ అనిపించే పాటలు ఎన్ని? ఇలా ఎన్నో రకాల సందేహాలు మెగా అభిమానుల్లో మొదలుతున్నాయి.
బుచ్చి బాబు అయితే రెహమాన్ పై ఎంతో కాన్పిడెంట్ గా కనిపిస్తున్నారు. ఓ పాట సినిమాలో హైలైట్ గా ఉంటుందని హింట్ ఇచ్చారు. సాధారణంగా రెహమాన్ ఏ సినిమాకి పనిచేసినా ఉన్న పాటల్లో ఒకటి మాత్రం హైలైట్ అవుతుంటుంది. అలాంటి పాట గురించి బుచ్చి లీక్ చేసి ఉండొచ్చు. మిగతా పాటల సంగతేంటి? అవి ఎలా వస్తున్నాయన్నది? సస్పెన్స్. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. చరణ్ కూడా రెడీగానే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.