సలార్ 2 రిలీజ్ డేట్ పై ఆ రోజే క్లారిటీ?

సలార్ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సలార్ 2 మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-11-03 23:30 GMT
సలార్ 2 రిలీజ్ డేట్ పై ఆ రోజే క్లారిటీ?
  • whatsapp icon

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి రాబోతున్న మూవీ ఇదే కావడం తో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ బిజినెస్ ఈ సినిమా మీద జరుగుతోందని తెలుస్తోంది. సలార్ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సలార్ 2 మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబందించిన షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ చేసారంట.

సలార్ సినిమాలో ప్రతినాయకులుగా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. సలార్ మొదటి పార్ట్ ఎండింగ్ లో పార్ట్ 2 రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. రెండో భాగం కూడా పూర్తి కావడంతో పూర్తిగా రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేయాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

బాహుబలి సిరీస్ తర్వాత ఇప్పటి వరకు ప్రభాస్ కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా పడలేదు. సలార్ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్య్యంలోనే సినిమా గురించి దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. సలార్ మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే పార్ట్ 2పైన అంచనాలు అమాంతం పెరిగిపోతాయి.

డిసెంబర్ 25న సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. అయితే డుంకీ ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సలార్ 2 ఏప్రిల్ లో రిలీజ్ అని ఫిక్స్ అయ్యారు. అయితే అదే నెలలో ఎన్టీఆర్ దేవర, పవన్ కళ్యాణ్ ఒజీ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ సారి ఈ ఇద్దరిలో ఎవరితో ప్రభాస్ పోటీ పడతాడు అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News