చర‌ణ్ కూతురు- అంబానీ కొడుకు ఇద్ద‌రికీ ఒక‌రే నానీ

తైమూర్ అలీ ఖాన్, క్లిన్ కారా కొణిదెల, అనంత్ అంబానీ స‌హా చాలామంది స్టార్ కిడ్స్ కి ల‌లితా నానీ కేర్ టేక‌ర్.

Update: 2024-07-18 16:51 GMT

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ కుమార్తె క్లీంకారా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్- క‌రీనా దంప‌తుల కుమారుడు తైమూర్ అలీఖాన్.. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ.. ఈ ముగ్గురికీ కేర్ టేక‌ర్ (నాని) ఒక్క‌రే కావ‌డం యాధృచ్ఛికం. ఆమె పేరు ల‌లితా డిసిల్వా. ఇటీవ‌ల అనంత్ అంబానీ పెళ్లి సంద‌డిలో సాధాసీదాగా క‌నిపించిన ఆమె ఎవ‌రో తెలుసుకునేందుకు అంతా ప్ర‌యత్నిస్తున్నారు. అయితే ఆమె వివ‌రాలు నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి.

భారతీయ సెలబ్రిటీ పిల్లలకు బాగా తెలిసిన నానీగా లలితా డిసిల్వాకు పాపులారిటీ ఉంది. ఇటీవల అంబానీల పెళ్లిలో ఆ కుటుంబంతో ఫోటోల్లో క‌నిపించింది. అలాగే త‌న క‌ళ్ల ముందే ఎదిగిన అనంత్ అంబానీ పెళ్లి చేసుకోవ‌డంతో ఎంతో ఉద్వేగానికి లోనైంది. సోష‌ల్ మీడియాల్లో నానీ ల‌లితా డిసిల్వా హృదయపూర్వక సందేశాలను షేర్ చేసారు. అనంత్ అంబానీని చూసుకోవడం మొద‌లు తన బేబీ కేర్ ఉద్యోగాన్ని వారి ఇంట‌ ప్రారంభించింది. అంబానీలతో ఆమెకున్న సన్నిహిత బంధం తాజా పోస్టుల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.

తైమూర్ అలీ ఖాన్, క్లిన్ కారా కొణిదెల, అనంత్ అంబానీ స‌హా చాలామంది స్టార్ కిడ్స్ కి ల‌లితా నానీ కేర్ టేక‌ర్.

లలితా డిసిల్వా ఇటీవల సోషల్ మీడియాలో అంబానీలతో ఉన్న కొన్ని అరుదైన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆమె అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంత్ బాబా.. అంబానీల ఆనందానికి ప్రేమకు నేను చాలా కృతజ్ఞురాలిని. మేము పంచుకున్న మధురమైన జ్ఞాపకాలను అద్భుత‌ క్షణాలను నేను జీవితంలో మ‌ర్చిపోలేను. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారి దయ ఔదార్యం నాకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. నా జీవితంలో నీతా భాభి - ముఖేష్ సార్‌ని కలిగి ఉండ‌టం ఆశీర్వాదం. వారు ఇప్పటికీ నన్ను వారి కుటుంబంలో ఒక భాగంగా ఆలింగనం చేసుకుంటారు. అనంత్ -రాధికలు అపారమైన ప్రేమ గొప్ప‌ది. వారు సంతోషం గా మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో భాగం కావ‌డాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను అని లలితా డిసిల్వా తన పోస్ట్‌లో రాశారు.

మరో పోస్ట్‌లో లలితా డిసిల్వా అంబానీలతో కలిసి తన బేబీ కేర్ జాబ్ ప్రారంభించినట్లు వెల్లడించారు. చిన్నతనంలో అనంత్ అంబానీకి నానీ కాబట్టి ఇరువురి న‌డుమా గొప్ప అనుబంధం ఉంది. యువకుడు అనంత్ అంబానీతో క‌లిసి ఉన్న ఒక అరుదైన ఫోటోని కూడా ల‌లిత నానీ ఇటీవ‌ల‌ పోస్ట్ చేసారు. అనంత్ అంబానీతో క‌లిసి పారిస్ డిస్నీ వరల్డ్ కి వెళ్లాన‌ని డిసిల్వా తెలిపారు. ఇక్కడే నేను నా బేబీ కేర్ జాబ్ ప్రారంభించాను.. అని కూడా వెల్ల‌డించారు. ''అనంత్ చిన్నతనంలో చాలా మంచి కుర్రాడు. ఇప్పటి వరకు కుటుంబంలో, అతడి చుట్టూ ఉండే సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరికీ ప్రేమగా ఉండేవాడు. ఈ రోజు వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. అత‌డు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని ధీవించారు.

కరీనా కపూర్ ఖాన్- సైఫ్ అలీ ఖాన్ మొదటి కుమారుడు తైమూర్‌తో రెగ్యుల‌ర్‌గా కనిపించినప్పుడు లలితా డిసిల్వా కు ప్ర‌జ‌ల్లో గుర్తింపు ద‌క్కింది. కరీనా- సైఫ్ ల చిన్న కుమారుడు జెహ్‌కు కూడా ఆమె నానీ. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన కామినేని దంప‌తుల‌ మొదటి బిడ్డ క్లిన్ కారా కొణిదెల సంరక్షణను చూసుకుంటుంది.

క్లీంకార కేర్ టేక‌ర్ జీతం?

మెగా కుటుంబంలోకి క్లీంకార‌ ఒక దివ్య ముహూర్తాన అడుగుపెట్టింది. చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల‌ కుమార్తె అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఓవైపు చ‌ర‌ణ్ బిజీ .. మ‌రోవైపు అపోలో మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌ల్ని నిర్వ‌హిస్తున్న ఉపాస‌న ఎల్ల‌పుడూ పూర్తి బిజీ. దీంతో ఎక్కువ స‌మ‌యం క్లీంకారాను అపోలోలో త‌న‌తోనే తిప్పాల్సిన ప‌రిస్థితి ఉంది. దీంతో ఈ జంట ఒక నానీని అపాయింట్ చేసుకున్నారు.

ఇంత‌కుముందు చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట త‌మ కుమార్తె క్లిన్ కారాతో క‌లిసి ప‌లుమార్లు ముంబైకి వెళ్ల‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముంబైలో వారు త‌మ స్వ‌గృహానికి వెళ్లిన స‌మ‌యంలో వారి వెంట ఒక నానీ క‌నిపించారు. ఆమె ఎవ‌రో కాదు.. సెల‌బ్రిటీ నాని ల‌లిత‌. తైమూర్ కి కేర్ టేక‌ర్ గా ప‌ని చేసిన ల‌లిత డిసిల్వా ఆ త‌ర్వాత షాహిద్ క‌పూర్- మీరా క‌పూర్ జంట కుమార్తెకు కూడా నానీగా ప‌ని చేసారు. ఇప్పుడు సావిత్రి క్లిన్ కారా ఆల‌నాపాల‌నా చూసే బాధ్య‌త‌ల్ని స్వీక‌రించార‌ని తెలుస్తోంది. ఉపాస‌న బిజీగా ఉన్న స‌మ‌యంలో క్లిన్ కారాకు అవ‌స‌ర‌మైన అన్ని సదుపాయాల‌ను త‌నే చూసుకుంటున్నారట‌. ఆమెకు చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు నెల‌కు 1.5 ల‌క్ష‌ల జీతం కూడా చెల్లిస్తున్న‌ట్టు స‌మాచారం.

Tags:    

Similar News