పెళ్లయిన వారానికే నాగచైతన్య షూటింగ్ కోసం?
ఈ పోరాటంలో ప్రేమికుడైన నాగచైతన్య జీవితం ఎలా సాగింది? అన్నదే ఈ సినిమా.
నాగచైతన్య- సాయి పల్లవి జంటగా నటించిన సినిమా `తండేల్`. చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 7 ఫిబ్రవరి 2025న విడుదలకు సిద్ధంగా ఉంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు ఆంధ్రా మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మత్స్యకారులు పాకిస్తాన్ జలాల్లో చిక్కుకుంటారు.. పాకిస్తానీ ఆర్మీ జైలులో వేస్తుంది. అయితే వారిని చివరికి విడుదల చేసారా లేదా? ఈ పోరాటంలో ప్రేమికుడైన నాగచైతన్య జీవితం ఎలా సాగింది? అన్నదే ఈ సినిమా.
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా షూటింగ్ ఈనెల 11 నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. నాగచైతన్య- శోభిత ధూళిపాల పెళ్లి సందర్భంగా చిన్న గ్యాప్ తీసుకున్న టీమ్ తిరిగి చిత్రీకరణకు రెడీ అవుతోంది. చైతూ సెట్స్ కి వస్తాడు. ఏడు రోజులు షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అతడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇక్కడే షూటింగ్ చేస్తారు. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక చైతన్య క్రిస్మస్ సెలవులు లేదా కొత్త సంవత్సరంలో హానీమూన్ కోసం సెలవులు తీసుకుంటాడని భావిస్తున్నారు.
ఆ ఏడు రోజుల్లో 2,3 రోజుల షూట్ నాగచైతన్యపై ఉండి ఉండొచ్చని అంచనా.. ఇటీవల పెళ్లిలో నాగచైతన్య గెటప్ మార్చకుండా కనిపించాడు. పెళ్లిలో గడ్డం, బాగా ఎదిగిన గిరజాల జుత్తుతో కనిపించాడు. ఇది నటుడిగా అతడి డెడికేషన్ కి నిదర్శనం. `తండేల్` పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేసాకే దీనిని తొలగిస్తాడు.
తాజాగా అందిన లీకుల ప్రకారం.. తండేల్ ఫైనల్ ఔట్ పుట్ పై నిర్మాతలు సంతృప్తికరంగా ఉన్నారని సమాచారం. సినిమా బాగా వచ్చింది...సమర్పకుడు అరవింద్ కి క్లైమాక్స్, చందూ టేకింగ్ చాలా బాగా నచ్చిందని సమాచారం... సినిమా రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
రామ్ చరణ్ , వెంకటేష్ నటించిన భారీ సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఆ ఇద్దరూ చైతూ ప్రొడ్యూసర్ అరవింది కి కావాల్సిన హీరోలు గనుక పండగ బరిలో కాకుండా ఫిబ్రవరిలో వస్తే బావుంటుందని నిర్ణయించుకున్నాడు. పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా పోటీగా రావడం సరికాదని నిర్ణయించుకోవడం వల్లనే.. ఇది ఫిబ్రవరికి వాయిదా పడింది.