చరణ్ -తారక్ రిస్క్ తీసుకోవడం లేదుగా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` విజయంతో గ్లోబల్ స్టార్స్ గా అవతరిం చిన సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` విజయంతో గ్లోబల్ స్టార్స్ గా అవతరిం చిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో ఇద్దరి హీరోల రేంజ్ పాన్ ఇండియాని దాటి పోయింది. హాలీవుడ్ సైతం రమ్మని ఆహ్వానిస్తోంది. బాలీవుడ్ దర్శకులు కూడా ఆ స్టార్స్ తో పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఛాన్స్ ఇవ్వాలే గానీ బడా నిర్మాణ సంస్థలు కోట్ట రూపాయలు వెచ్చించడానికి రెడీగా ఉన్నాయి.
కానీ ఆ ఇద్దరు మాతృ భాష తర్వాత ఏ పరిశ్రమైనా అంటూ తెలుగు సినిమాలే చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు హీరోలు ఎంపిక చేసుకున్న దర్శకులు ప్రతిభావంతులు.. గొప్ప ట్రాక్ రికార్డుల్ని కలిగినప్పటికీ ఎక్కడో సందేహం అభిమానుల్ని వెంటాడుతుంది. ప్రస్తుతం చరణ్ `గేమ్ ఛేంజర్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` సెట్స్ లో ఉండగానే శంకర్ నుంచి ఈసినిమా ప్రకటించాడు చరణ్.
`ఆర్ ఆర్ ఆర్` పూర్తయిన వెంటనే మరో ఆలోచన లేకుండా `గేమ్ ఛేంజర్` షురూ చేసాడు. అయితే గేమ్ ఛేంజర్ కంటే ముందు శంకర్ నుంచి రిలీజ్ అయిన `2.0` భారీ విజయం సాధించిన చిత్రంగా భావించడా నికి లేదు. ఆ సినిమా బడ్జెట్ 500 కోట్లు పెడితే 600 కోట్లతో నష్టాలు లేకుండా బయట పడింది. అంతకు ముందు తెరకెక్కించిన `ఐ` అయితే పూర్తిగా నష్టాలే చూసింది. ఆ రకంగా చూసుకుంటే `రోబో` తర్వాత శంకర్ కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేనట్లే అవుతుంది. కానీ చరణ్ వాటిని పట్టించుకోకుండా శంకర్ ట్రాక్ రికార్డు చూసి ముందుకెళ్తున్నాడు.
ఈ సందేహమే `గేమ్ ఛేంజర్` డైహార్డ్ అభిమానుల్ని ఎక్కడో కంగారు పెడుతుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాలని `దేవర` కోసం ఎంతగా సానబెట్టాడో తెలిసిందే. కథ లాక్ చేయడం కోసమే తారక్ ..కొరటాలకు చుక్కలు చూపించినంత పనిచేసాడు. కొరటాల మాడ్యులేషన్ ఓ పట్టాన కుదరకపోవడంతో రకరకాలుగా స్టోరీలో ఛేంచెస్ చివరికి ఎలాగూ సెట్స్ కి వెళ్లారు. అయితే కొరటాల అంతకు ముందు తెరకెక్కించిన `ఆచార్య` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
అంతకు ముందు వరకూ వరుస విజయాల్లో ఉన్నకొర టాలపై ` ఆచార్య `ప్లాప్ ఓ మచ్చగా మారింది. సరిగ్గా ఇదే సమయంలో తారక్ ..`దేవర`ని సెట్స్ పైకి తీసుకెళ్లడం కొంత మంది అభిమానుల్లో ఆందోళన గానూ కనిపిస్తోంది. మరోవైపు కొరటాల సక్సస్ ట్రాక్ గుర్తు చేసుకుంటే డౌటే లేదు `దేవర` బ్లాక్ బస్టర్ ఖాయం అనుకోవడం అంతే నమ్మాకాన్ని కలిగిస్తుంది. ఏది ఏమైనా పాన్ ఇండియా హీరోలిద్దరు సక్సస్ ని నమ్ముకుని ముందు కెళ్తున్నారని చెప్పొచ్చు.