చెర్రీ క్లిక్: సీఈవో అయినా సెల్ఫీ దిగాలి

ఇక సినీప‌రిశ్ర‌మలో పెట్టుబ‌డులు పెట్టేది కార్పొరెట్ కనుక రంగుల ప్ర‌పంచం ఎప్పుడూ క‌ళ‌క‌ళ‌లాడుతూనే ఉంటుంది.

Update: 2023-12-07 18:46 GMT

మిలియ‌నీర్లు బిలియ‌నీర్లు ట్రిలియ‌నీర్లకు ప్ర‌పంచంలో కొద‌వేమీ లేదు. బ‌డా పారిశ్రామిక వేత్తలు.. బిజినెస్ మ్యాగ్నెట్లు.. కార్పొరెట్ కంపెనీ సీఈవోలు .. ఎంద‌రున్నా వీళ్ల‌లో మెజారిటీ ప్ర‌ముఖులు గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ‌ను వెతుక్కుంటూ వ‌స్తున్నారు. గ్లిజ్ అండ్ గ్లామ్ ఆక‌ర్ష‌ణ అలాంటిది. హైద‌రాబాద్ కి గ్లామ‌ర్ తెచ్చింది హైటెక్ సిటీనా? ఫిలింన‌గ‌రా? అంటే క‌చ్ఛితంగా ఫిలింన‌గ‌ర్ గురించే మాట్లాడుతారు. ఎందుకంటే గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ పాపుల‌ర్ ప‌ర్స‌నాలిటీస్ అంతా నివ‌శించేది ఇక్క‌డే. ఇక సినీప‌రిశ్ర‌మలో పెట్టుబ‌డులు పెట్టేది కార్పొరెట్ కనుక రంగుల ప్ర‌పంచం ఎప్పుడూ క‌ళ‌క‌ళ‌లాడుతూనే ఉంటుంది.


అదంతా స‌రే కానీ.. ఇప్పుడు Netflix CEO #TedSarandos హైదరాబాద్‌లో దిగగానే, నేరుగా గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నివాసానికి వెళ్లారు. ఆయన మెగా స్టార్ చిరంజీవి, చ‌ర‌ణ్ ల‌తో ఆనందకరమైన స‌మ‌యాన్ని గ‌డిపారు. ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ తో ఇదిగో ఇలా సెల్ఫీ దిగారు. దీంతో ఈ ఫోటోలు వీక్షించిన అభిమానులు ఎంత పెద్ద కంపెనీ సీఈవో అయినా స్టార్ల‌తో సెల్ఫీ దిగాల్సిందే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గ్లామ‌ర్ అండ్ గ్లిజ్ కి ఉన్న గొప్ప‌త‌నం ఇది అని విశ్లేషిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ `గేమ్ ఛేంజ‌ర్`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ తో చ‌ర‌ణ్ కి స‌త్సంబంధాలున్నాయి. అతడి సినిమాల ఓటీటీ రైట్స్ ను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేందుకు నెట్ ఫ్లిక్స్ ఎల్ల‌పుడూ ఆస‌క్తిగా ఉంటుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సీఈవోతో చ‌ర‌ణ్ స‌మావేశం సారాంశ‌మేమిటో అత‌డే చెప్పాల్సి ఉంటుంది.


ఒక‌వైపు గుడులు గోపురాలు.. మ‌రోవైపు సీఈవోల‌తో స‌మావేశాలు:

రామ్ చ‌ర‌ణ్ కొద్ది రోజుల క్రితం మైసూరులోని ప్రఖ్యాత చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన సంగ‌తి తెలిసిందే. మైసూరులోని అరుదైన లొకేష‌న్ల‌లో గేమ్ ఛేంజర్ చిత్రీక‌ణ సాగుతుండ‌గా స్థానికంగా ఉన్న దేవాల‌యాన్ని చ‌ర‌ణ్ సంద‌ర్శించారు. చాముండేశ్వ‌రి అమ్మ వారి ఆశీర్వాదం అందుకున్నారు. స్వ‌త‌హాగా ఆధ్యాత్మికత‌పై అచంచ‌ల విశ్వాసం ఉన్న చ‌ర‌ణ్ దేవాల‌యాల సంద‌ర్శ‌న‌ను అమితంగా ఇష్ట‌ప‌డ‌తార‌న్న సంగతి తెలిసిందే. చాముండేశ్వ‌రి అమ్మ వారి ఆశీర్వాదం కోరిన తర్వాత, ఆలయ దేవతకు ఉదారంగా కానుకలు సమర్పించి, హుండీలో భారీ మొత్తాలను కానుక‌గా వేసి, ఆలయ పూజారి నుండి హారతి అందుకున్నాడు చ‌ర‌ణ్‌.


ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయంలో పవిత్రమైన ఆచారంలో క‌నిపించిన చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత‌ అయ్యప్ప‌ దీక్షలో క‌నిపించారు. ఇప్పుడు చాముండేశ్వ‌రి ఆల‌యంలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో క‌నిపించారు. ఇది ఒక హీరోలో యూనిక్ క్వాలిటీ అని ప్ర‌జ‌లు ప్ర‌శంసిస్తున్నారు. రాజమౌళి తెర‌కెక్కించిన‌ RRR లో స్వాతంత్య్ర‌ సమరయోధుడు అల్లూరి సీతా రామరాజుగా న‌టించిన చ‌ర‌ణ్ ప్ర‌ముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న `గేమ్ ఛేంజర్` చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ క‌థానాయిక‌. ఇందులో SJ సూర్య, జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నాసర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్ త‌దిత‌రులు న‌టించారు. శక్తివంతమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Tags:    

Similar News