చిరు ద్విపాత్రలు.. హరీష్ దర్శకత్వం!
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ప్రకటన రూపొందించారు. చిరు కామిక్ టైమింగ్, డైలాగ్ పవర్ ని వందశాతం వాడుకుని ప్రకటనను సక్సెస్ చేసాడు.
ద్విపాత్రాభినయంతో రక్తి కట్టించడంలో మెగాస్టార్ తర్వాతే! మాస్‌ని ఒక ఊపు ఊపడంలో ఆయన కామెడీ టైమింగ్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఒక కమర్షియల్ ప్రకటన కోసం మెగాస్టార్ పెర్ఫామెన్స్ ఇదే తీరుగా చర్చనీయాంశం అవుతోంది. ఇది ఒక పాల ఉత్పత్తికి సంబంధించిన యాప్ కి ప్రమోషన్. దీనికి షాపులు ఉండవు.. ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడమే.
ఈ ప్రకటన కోసం మెగాస్టార్ లోని అందరివాడు బయటకు వచ్చాడు. వీడియోలో చిరంజీవి షాట్‌కు సిద్ధమవుతూ ఉంటే.. అకస్మాత్తుగా ఆయనలోంచి ఆత్మారావు బయటకు వస్తాడు. ఆత్మారావుతో మెగా బాస్ మాటల్లోనే బ్రాండ్ గురించిన వివరాలు వెల్లడయ్యాయి. హాస్యనటుడు సత్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఈ ప్రకటనలో కనిపించాడు.
అతడు షాట్ సిద్ధంగా ఉందని చెప్పడానికి చిరు వద్దకు వస్తాడు. కానీ చిరు ఎవరితోనో మాట్లాడటం చూసి కంగారు పడిపోతాడు. ఆత్మతో సంభాషిస్తూనే... తన డైలాగులను రిహార్సల్ చేస్తున్నాడని సత్యకు చెప్పారు చిరు. ఒక్క డైలాగ్ కోసం రిహార్సలా? అంటూ సత్య ఆశ్చర్యపోతాడు. జై చిరంజీవ అని సత్య అంటాడు. ఈ షాట్‌లో చిరు అందరివాడు, ఘరానా మొగుడు టింజ్ ని ప్రదర్శించడం అభిమానులకు ట్రీట్ అనడంలో సందేహం లేదు. ప్రకటనలో మెగా బాస్ ద్విపాత్రాభినయం అదుర్స్.
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ప్రకటన రూపొందించారు. చిరు కామిక్ టైమింగ్, డైలాగ్ పవర్ ని వందశాతం వాడుకుని ప్రకటనను సక్సెస్ చేసాడు. మొత్తానికి ఆన్ లైన్ మిల్క్ బ్రాండ్ యాప్ లను ప్రజలు ఏ మేరకు డౌన్ లోడ్ చేస్తారన్నది వేచి చూడాలి. ప్రచారం చేసింది మెగా బాస్ కాబట్టి.. ఇప్పటికే ఫ్యాన్స్ డౌన్ లోడింగ్ ప్రాసెస్ లో ఉన్నారని అంచనా వేయొచ్చు.