సెంచరీకి చేరువలో మెగాస్టార్ రెమ్యునరేషన్..?

అయితే ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో కూడా మార్కెట్ ని పెంచుకోవడాలని మెగాస్టార్ భావిస్తున్నారు.

Update: 2025-01-02 09:30 GMT

టాలీవుడ్ లో టైర్ 1 హీరోలు అంటే కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపిస్తుంది. 10 ఏళ్ళు సినిమాలకి దూరంగా ఉన్న కూడా మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఒకప్పటి జోరు చూపిస్తూ తనకి తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో పాటు తన దైన కమర్షియల్ ఎంటర్టైనర్ లు చేశాడు.

అయితే ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో కూడా మార్కెట్ ని పెంచుకోవడాలని మెగాస్టార్ భావిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం చిరంజీవికి 200 కోట్ల వరకు మార్కెట్ ఉంది. మినిమమ్ సూపర్ హిట్ పడితే మెగాస్టార్ చిత్రం 200 కోట్లు ఈజీగా దాటేస్తుంది.

ఒకప్పుడు తెలుగు సినిమాకి 100 కోట్లు కలెక్షన్స్ రావడం గగనం అయిపోయేది. ఇప్పుడు మాత్రం 500-1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకునే రేంజ్ కి తెలుగు సినిమాలు వెళ్లాయి. మినిమమ్ టైర్ 2 హీరోలకి సూపర్ హిట్ పడిన 100 నుంచి 150 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. టైర్ 1 హీరోల మార్కెట్ రేంజ్ పెరగడంతో వారి రెమ్యునరేషన్ లు కూడా పెరిగాయి.

ప్రభాస్, అల్లు అర్జున్ లాంటివారు 150-300కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకి 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. నెక్స్ట్ శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ ని మెగాస్టార్ ఒకే చేసేసారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

దీనికోసం చిరంజీవికి నిర్మాత 75 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారంట. దీంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారు. దీనికి కూడా 75 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాని వెంటనే సెట్స్ పైకి తీసుకోని వెళ్లనున్నారు.

శ్రీకాంత్ ఓదేల నానితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. 2025 ఆఖరులో శ్రీకాంత్ సినిమా మొదలు కావొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయితే చిరంజీవి నెక్స్ట్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ గా చిరంజీవి ఉన్నారు. చిరంజీవి తర్వాత రెండో స్థానంలో బాలయ్య ఉన్నారు. మరి మెగాస్టార్ ఎంత తొందరగా సెంచరీకి చేరువవుతారో చూడాలి.

Tags:    

Similar News