'విశ్వంభర' వీడియో : చిరు భలే ప్లాన్‌ చేశారే!

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

Update: 2024-07-04 06:31 GMT

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఒకప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్‌ ను చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కలిసి కూర్చుని నిర్వహించే వారు. కానీ ఇప్పుడు మాత్రం విదేశాల్లో, ఎక్కడో హాలీడే స్పాట్స్ లో దర్శకుడు మరియు సంగీత దర్శకులు మాత్రమే పాల్గొంటున్నారు. ఆ పద్దతికి స్వస్థి చెప్పి మెగాస్టార్ ఇలా ప్లాన్‌ చేశారు.

దర్శకుడు, సంగీత దర్శకుడితో పాటు హీరో చిరంజీవి మరియు ఇతర సాంకేతిక వర్గం కూడా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి పాత సినిమాలకు చెందిన కొన్ని పాటలను కీరవాణి తన టీం తో పాడటంతో పాటు సంగీత కచేరి నిర్వహించారు.

సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఆ రోజులను గుర్తు చేస్తూ చిరంజీవి ఈ వీడియోను షేర్ చేయడంతో పాటు కీరవాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అందరు హీరోలు దర్శకులు ఇలాగే ప్లాన్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read more!

బింబిసార చిత్రం తర్వాత దర్శకుడు వశిష్ట ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో త్రిష నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక చిరంజీవి చెల్లెల్ల పాత్రల్లో పలువురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారు.


Tags:    

Similar News

eac