మెగాస్టార్ 156.. ఇది అసలు మ్యాటర్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాతో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా తమన్నా నటించింది. కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటి భోళా శంకర్ ట్రైలర్ పక్క కమర్షియల్ లైన్ లో మెగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి.
ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుస్మిత కొనిదెల ఈ మూవీ నిర్మించనుంది. అఫీషియల్ గా ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతుందని తెలుస్తోంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా మెగాస్టార్ 156 మూవీ మలయాళీ హిట్ చిత్రం బ్రోడాడీ రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది.
లూసిఫర్ తర్వాత పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని మెగాస్టార్ తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. ఈ నేపథ్యంలో మరల వారిద్దరి కాంబోలో వచ్చిన బ్రో డాడీ రీమేక్ గానే కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోయే సినిమా ఉండబోతోందనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ప్రసన్న కుమార్, కళ్యాణ్ కృష్ణ సిద్ధం చేస్తోన్న స్టోరీ కంప్లీట్ గా క్రొత్తదని, మెగాస్టార్ ని దృష్టిలో ఉంచుకొని రెడీ చేస్తున్న కథ అని తెలుస్తోంది.
భోళా శంకర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంట. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తండ్రి కొడుకుల కథాంశంతోనే ప్రసన్న కుమార్ ఈ స్టోరీని సిద్ధం చేయడంతో బ్రో డాడీ రీమేక్ అంటూ ప్రచారం చేశారు. ధమాకాతో ప్రసన్న కుమార్ రైటర్ గా మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు మెగాస్టార్ కి కథని చెప్పి మెప్పించారు.
వీలైనంత తక్కువ టైంలో ఈ మూవీని కంప్లీట్ సంక్రాతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కొడుకు పాత్ర కోసం సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే భార్య పాత్ర కోసం త్రిషని సంప్రదిస్తున్నారంట. శ్రీలీలను మరో కీలక పాత్ర కోసం ఎంఓపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్రోడాడీ మూవీ రీమేక్ కింగ్ నాగార్జున, అఖిల్ అక్కినేని కలిసి చేద్దామని అనుకుంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.