కూతురు బ్రేక‌ప్‌ని స‌మ‌ర్థించిన న‌టుడు

గ‌త కొంత‌కాలంగా లైగ‌ర్ బ్యూటీ అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్ బ్రేక‌ప్ గురించి విస్త్ర‌తంగా ప్ర‌చారం సాగుతోంది

Update: 2024-06-09 02:30 GMT

గ‌త కొంత‌కాలంగా లైగ‌ర్ బ్యూటీ అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్ బ్రేక‌ప్ గురించి విస్త్ర‌తంగా ప్ర‌చారం సాగుతోంది. ఆ ఇద్ద‌రూ ఎవ‌రి దారిలో వారు ఉన్నార‌న్న మీడియా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. విడిపోయినా ఆ ఇద్ద‌రూ స్నేహంగా ఉన్నార‌ని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా చంకీ పాండే షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారింది. చుంకీ పాండే తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆదిత్యారాయ్ క‌పూర్ తో క‌లిసి దిగిన ఫోటోలను షేర్ చేసాడు. దీంతో శనివారం నాడు.. ట్రెండ్స్ జాబితాలో చంకీ చేరాడు. చుంకీ పాండే కుమార్తె అనన్యతో ఆదిత్య‌ డేటింగ్ నిరంత‌రం హెడ్‌లైన్స్ లో ఉండేది .. కానీ ఇప్పుడు లేదు. ఈ జంట గ‌త‌ మార్చిలో విడిపోవ‌డంతో అంతా స్థ‌బ్ధుగా ఉంది.

ఆస‌క్తిక‌రంగా ఇటీవలే ఆదిత్య‌రాయ్ క‌పూర్- చంకీ పాండే క‌లిసి ప్రకటనల్లో కనిపించారు. ''గోవా నుండి సర్ కార్లిటో బ్రెగాంజాను కలవండి'' అని చంకీ పాండే తాజా పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. గోవాలోని కాబో డి రామా బీచ్‌లోని ఫోటోలు ఇవి అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్ మార్చిలో విడిపోయారు. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ ఇద్దరు తార‌ల‌ సన్నిహిత మిత్రుడు బాంబే టైమ్స్‌కి చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. దాదాపు ఒక నెల క్రితం ఈ ఇద్ద‌రూ విడిపోయారు. ఈ అంద‌మైన జంట‌ విడిపోవడం మా అందరికీ షాక్ ఇచ్చింది. విడిపోయినా ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్నారు. అనన్య ప్ర‌స్తుతానికి పెట్ డాగ్‌తో సమయం గడుపుతోంది.. పరిస్థితిని పరిపక్వంగా ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తోంది.. అని తెలిపారు. అయితే ఇటీవ‌ల ఓ పోస్ట్ లో అన‌న్య త‌న‌లోని ఎమోష‌న్‌ని దాచుకోలేక‌పోయింది. తాను ఏదో కోల్పోయిన భావ‌న‌ను వ్య‌క్త‌ప‌రిచింది.

నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ 'ఖో గయే హమ్ కహాన్‌'లో అనన్య పాండే చివరిగా కనిపించింది. త‌దుప‌రి కంట్రోల్, ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సి శంకరన్ నాయర్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. తదుపరి షో 'కాల్ మి బే'లోను కనిపించనుంది. ఆదిత్య రాయ్ కపూర్,తదుపరి అనురాగ్ బసు 'మెట్రో ఇన్ డినో'లో కనిపిస్తాడు. సారా అలీ ఖాన్, ఫాతిమా సనా షేక్, అలీ ఫజల్, కొంకణా సేన్ శర్మ, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠి, అనుపమ్ ఖేర్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు.

Tags:    

Similar News