‘పుష్ప 2’ బిగ్ క్లాష్.. వాళ్ళు తగ్గట్లే..

కానీ తాజా సమాచారం ప్రకారం, చావా ఇంకా డిసెంబర్ 6నే విడుదలకు సిద్ధంగా ఉంది. వాళ్ళు పెద్దగా భయపడటం లేదని టాక్ వినిపిస్తోంది.

Update: 2024-10-31 06:40 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ పై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం ఈ సినిమా తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. మొదట ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మేకర్స్ మళ్ళీ డిసెంబర్ 5కి మార్చారు. ఇక డిసెంబర్ 6న విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చావా అనే చారిత్రక వార్ మూవీ కూడా విడుదల కావాల్సి ఉంది.

 

అయితే ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఉండటం వల్ల చావా చిత్ర బృందం తమ సినిమాను వాయిదా వేయాలని పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. పుష్ప 2 సునామీ ముందు చావా నిలబడలేదనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, చావా ఇంకా డిసెంబర్ 6నే విడుదలకు సిద్ధంగా ఉంది. వాళ్ళు పెద్దగా భయపడటం లేదని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే పరిశ్రమలో సినిమాల కొరత ఉండటంతో ఒకదానితో ఒకటి క్లాష్ అవుతూ విడుదలకు సిద్ధం అవుతుండటం చిత్రవర్గాల్లో నిరాశను కలిగిస్తోంది. డిసెంబర్ 6 ఎలాంటి సెలవు రోజు కానందున ఈ పోటీ ఇరువురు నిర్మాతలకు వ్యాపార పరంగా నష్టాన్ని కలిగించే అవకాశముంది. ప్రత్యేకించి ప్రారంభ దశలో విడుదలైన చిత్రం ఎక్కువ షేర్ రేటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది, కానీ పోటీ కారణంగా ఈ వసూళ్లు తగ్గే ప్రమాదం ఉంది.

ఒక సినిమా మొదటి వారంలో ఎక్కువ షేర్ సంపాదించగలిగినప్పుడు, ఆ తర్వాతి వారాల్లో వచ్చిన వసూళ్లలో ఈ రేటు తక్కువగా ఉంటుంది. మహారాష్ట్రలో ‘చావా’కి మంచి మార్కెట్ ఉంది. ఛత్రపతి శివాజీ వారసుడి కథ కావడంతో సెంటిమెంటు వర్కౌట్ అయితే జనాలు థియేటర్స్ కు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇక ‘పుష్ప 2’కు కూడా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ ఇరువురు నిర్మాతలకు వ్యాపార పరంగా తగ్గింపు కలిగించే అవకాశం ఉంది.

‘పుష్ప 2’ కోసం సోలో రిలీజ్‌ ఉంటే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్స్ కూడా కోరుకుంటున్నారు, చావా వాయిదా పడే అవకాశముందని రకరకాల వార్తలు వస్తున్నా కూడా మేకర్స్ మాత్రం ఆ విషయంలో పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదు. చావా ట్రైలర్ కూడా త్వరలో విడుదల కానుందని కూడా సమాచారం. ప్రస్తుతం ఈ రెండు సినిమాల విడుదలపై స్పష్టత లేకపోవడంతో సినీ వర్గాల్లో గందరగోళం నెలకొంది.

Tags:    

Similar News