ప్ర‌భుత్వం వేధిస్తోంద‌న్న మూసేవాలా తండ్రి

త‌న భార్య 58 ఏళ్ల వయస్సులో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) టెక్నిక్ ద్వారా బిడ్డ‌ను ప్రసవించ‌గా నిబంధ‌న‌ల పేరుతో పంజాబ్ ప్రభుత్వం తనను వేధిస్తోంద‌ని ఆవేద‌న చెందారు.

Update: 2024-03-20 17:14 GMT

దివంగత గాయకుడు, డాన్ సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ పంజాబ్ ప్ర‌భుత్వంపై తీవ్రంగా ఆరోపించారు. త‌న భార్య 58 ఏళ్ల వయస్సులో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) టెక్నిక్ ద్వారా బిడ్డ‌ను ప్రసవించ‌గా నిబంధ‌న‌ల పేరుతో పంజాబ్ ప్రభుత్వం తనను వేధిస్తోంద‌ని ఆవేద‌న చెందారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఐవీఎఫ్ చికిత్స గురించి నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోరింది. సంబంధిత శాఖ‌కు నివేదిక‌ను సమర్పించాలని ఒత్తిడి చేస్తోంది. ``సహాయక పునరుత్పత్తి సాంకేతికత (నియంత్రణ) చట్టం, 2021లోని సెక్షన్ 21(g)(i) ప్రకారం, ART సేవల కింద వెళ్లే మహిళకు సూచించిన వయోపరిమితి 21-50 సంవత్సరాల మధ్య ఉంటుంది`` అని నోటీసులో పేర్కొన్నార‌ని తెలిసింది.

అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ 2021లోని సెక్షన్ 21 (జి) (i) నిబంధనల ప్రకారం, 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీ మాత్రమే IVF సాంకేతికత సహాయంతో బిడ్డకు జన్మనివ్వాలి. 58 ఏళ్ల వయసులో సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్‌ కౌర్‌ ఐవీఎఫ్‌ టెక్నిక్‌ ద్వారా డెలివరీ చేసిన ఘటనపై నివేదిక ఇవ్వాలని మంత్రిత్వ శాఖ‌ లేఖలో కోరింది. వాస్తవానికి భారత ప్రభుత్వంలోని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం 2021లోని సెక్షన్ 21 (జి) (i) నిబంధనల ప్రకారం, 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీ మాత్రమే బిడ్డకు జన్మనిస్తుంది అని నియ‌మం ఉన్న‌ట్టు గుర్తు చేసారు.

మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ తన ఫేస్‌బుక్ పేజీలో నవజాత శిశువుకు జన్మనిచ్చినట్లు ప్రకటించాడు. అతడు త‌న‌ భార్య చరణ్ కౌర్... మూసేవాలా తమ్ముడిని ఆహ్వానించ‌డంతో ఆనందం వ్య‌క్త‌ప‌రిచారు. శుబ్‌దీప్‌(సిద్ధూ మూసేవాలా)ను ప్రేమించే లక్ష‌ల‌ కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో సర్వశక్తిమంతుడు శుభ్ తమ్ముడితో మమ్మల్నిదేవుడు ఆశీర్వదించాడు అని బాల్కౌర్ పంజాబీలో పోస్ట్ చేశాడు. కుటుంబం ఆరోగ్యంగా ఉంది..శ్రేయోభిలాషులందరి అపారమైన ప్రేమకు నేను కృతజ్ఞుడను అన్నారాయన. కానీ ఈ ఆనందాన్ని నిలువ‌నీయ‌కుండా ఇప్పుడు ప్ర‌భుత్వ‌మే వారిని వివ‌ర‌ణ కోరుతోంది. ప్ర‌ముఖ గాయ‌కుడు సిద్ధూ మూసేవాలాకు పంజాబ్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. గాయ‌కుడిగా అసాధార‌ణ ప్ర‌జ్ఞావంతుడు. అయితే అత‌డికి మాఫియా థ్రెట్ ఎదురైంది. గ్యాంగ్ వార్ లో అత‌డు హ‌త్య‌కు గుర‌య్యాడు.

Tags:    

Similar News