సూర్య సినిమా కోసం 500 కోట్లా?

ఈ సినిమాతో పాటూ తనకు సూరరై పొట్రు.. సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుధా కొంగరతో సెకండ్ మూవీ చేయనున్నాడు.

Update: 2024-01-28 23:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కంగువ చేస్తూనే.. మరోవైపు వెట్రిమారన్ తో వాడివాసల్ చేయాల్సి ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'కంగువ' ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటూ తనకు సూరరై పొట్రు.. సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుధా కొంగరతో సెకండ్ మూవీ చేయనున్నాడు.

ఇక ఇప్పుడు సూర్య ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టుతోనే సూర్య బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా సూర్య తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకి 'కర్ణ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.500కోట్ల భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుంది. మహాభారతం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య కర్ణుడి పాత్ర పోషించనున్నారట.

అంతేకాదు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వివిధ ఇండస్ట్రీలకు చెందిన కొందరు స్టార్లు కూడా ఈ మూవీలో నటించననున్నారని టాక్. ఇక ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ దేవర మూవీతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ కి ఇలాంటి భారీ ప్రాజెక్టులో ఛాన్స్ రావడం విశేషం.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ ఉన్నారు. ఇక సూర్య కంగువా విషయానికొస్తే.. తమిళ మాస్ దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య ఆరు విభిన్న తరహా పాత్రల్లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని ఏకంగా 38 భాషల్లో విడుదల చేయబోతున్నారు.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కథానాయకగా నటిస్తుంది. ఇటీవల యానిమల్ మూవీలో విలన్ గా అదరగొట్టిన బాబి డియోల్ ఇందులో మరోసారి విలన్ రోల్ చేస్తున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags:    

Similar News