గ్రామీణ ఓటు బ్యాంకుపై 'చిన్నమ్మ' కన్నేశారా?!
ఇక్కడ ఆమె లేవనెత్తుతున్న సమస్య.. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడేస్తోంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి గ్రామీణ ఓటు బ్యాంకుపై కన్నేశారా? గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలను కదిలించే వ్యూహానికి నడుం బిగిం చారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షు రాలిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే సంచలన విషయాన్ని ఆమె భుజాలకు ఎత్తుకున్నారని రాజకీ య విశ్లేషకులు చెబుతున్నారు.
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం దారి మళ్లి స్తోందని గత రెండేళ్లకుపైగా.. అన్ని పక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. గతంలో ఒకసారిటీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుని .. ఉద్యమం అన్నారు. కానీ, ఎందుకో.. మధ్య లోనే దానిని వదిలేశారు. ఇక, జనసేన అధినేత పవన్ కూడా పంచాయతీ నిధులు కూడా మీరే తీసేసు కుంటారా? అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి బుగ్గన ఒకసందర్భంలో అసెంబ్లీలోను, తర్వాత ప్రత్యేక మీడియా సమావేశం లోనూ పంచాయతీ నిధులపై వివరణ ఇచ్చారు. పంచాయతీలు విద్యుత్ సహా ఇంటి పన్ను బకాయిలు ఉన్నాయని..అందుకే నిధులు జమ చేసుకున్నామని.. గతంలోకూడా ఇలానే చేశారని ఆయన వ్యాఖ్యా నించారు. తర్వాత.. దీని ఊసు లేకుండా పోయింది. అయితే.. ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి ఈ సమ స్యను తలకెత్తుకున్నారు.
ఇక్కడ ఆమె లేవనెత్తుతున్న సమస్య.. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడేస్తోంది. అయితే.. వాస్తవానికి బీజేపీ పాలిత యూపీ, మధ్యప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఉందని.. ఇటీవల పార్లమెంటుకు కేంద్రమే వివరించింది. కాబట్టి.. పురందేశ్వరి వ్యూహం ఏంటంటే.. గ్రామీణ ఓటు బ్యాంకును ఈ మార్గం ద్వారా కదిలించి. బీజేపీ పునాదులను అక్కడ నుంచి వేసుకురావాలనే ఉద్దేశం ఉందని అంటున్నారు.
అందుకే.. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పురోహితులపై బెదిరింపులు, ఆలయాల్లో ఘటనలను, పురోహితులపై దాడులను ఆమె ఎక్కడా లెక్కలోకితీసుకోకుండా.. ఫక్తు.. సాధారణ పార్టీ నాయకురాలిగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.