హీరోయిన్ల గుండెల్లో డీప్ ఫేక్ రైళ్లు పరిగెట్టిస్తుందా?
ఇక వ్యక్తిగతంగా రష్మిక ఎంత బాధపడిందో తెలిసిందే. చేయని తప్పుకు శిక్ష లాంటిదిగా ఆ వీడియోని భావించాల్సి వచ్చింది
హీరోయిన్ల గుండెల్లో డీప్ ఫేక్ రైళ్లు పరిగెట్టిస్తుందా? ఓపెన్ అవ్వలేదు గానీ అంతా నాకేం జరుగుతుందో? అన్న టెన్షన్ లో పడ్డారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ఇటీవల రష్మిక మందన్న డీప్ ఫేక్ నెట్టింట ఎంత సంచలమైందో తెలిసిందే. మరోకరి శరీరానికి..ముఖానికి..రష్మిక ముఖాన్ని అతికించి అతికించి ఏఐ టెక్నాలజీ తో చేసిన వీడియో నెట్టింట పెద్ద సంచలనమే రేపింది. ఈ నేపథ్యంలో ఆమెకు మద్దతుగానూ టాలీవుడ్ సహా పలువురు సెలబ్రిటీలు నిలిచారు.
ఇక వ్యక్తిగతంగా రష్మిక ఎంత బాధపడిందో తెలిసిందే. చేయని తప్పుకు శిక్ష లాంటిదిగా ఆ వీడియోని భావించాల్సి వచ్చింది. ఈ విషయంలో మిగతా హీరోయిన్లు ఆమెకి బాసటగా నిలిచారు. ఇలాంటి వాటిపై ఉద్యమించాలని...ప్రభుత్వాలు..అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు అలాంటి అనుభవం ఎదురైతే? ఎవరికి చెప్పుకోవాలని భవిష్యత్ ని ముందే ఊహించారు.
అందుకే రష్మిక విషయంలో కొంత మందీ సిరియస్ గా పరిగణించాలని విజ్ఞప్తి చేసారు. ఆ వీడియో రిలీజ్ అయిన వారం రోజులు కూడా గడవక ముందే తాజాగా అదే రష్మికపై మరో డీప్ ఫేక్ కూడా కొన్ని గంటల క్రితమే రిలీజ్ అయింది. దీంతో మరోసారి రష్మిక పేరు హాట్ టాపిక్ గా మారింది. పదే పదే రష్మిక ఎందుకు టార్గెట్ అవుతుంది అన్న చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇలాంటి వాటికి బలయ్యేది స్టార్ హీరోయిన్లే.
వాళ్ల టార్గెట్ గా కనిపిస్తుంది. చిన్న చితకా హీరోయిన్లు పట్టించుకునే ఛాన్స్ తక్కువే. ఇన్ స్టా..ట్విటర్ వంటి మాధ్యమాల్లో లక్షల్లో ఫాలోవర్స్ కలిగింది కేవలం హీరోయిన్లే. నిత్యం రకరకాల ఫోటోలు వైరల్ అయ్యేవి వాళ్లవే. దీంతో వాళ్లంతా ఇప్పుడు టెన్షన్ పడే సమయం ఆసన్నమైనట్లే. ఎందుకంటే డీప్ ఫేక్ లు ఎక్కడ నుంచి వస్తున్నాయో? ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. భారత్ సర్వర్ నుంచే అది వైరల్ అయిందా? లేక విదేశీ సర్వర్ల నుంచి ఇండియాకి వచ్చిందా? అన్నది క్లారిటీ లేదు.
ఇప్పటికే సైబర్ మోసాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై సైబర్ క్రైమ్ ఎంత యాక్టివ్ గా పనిచేసినా? కొత్త గ్యాంగ్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఏదో రూపంలో కొత్త మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకమైన చట్టాలంటూ కూడా లేని నేపథ్యంలో ఏఐ టెక్నాలజీతో హీరోయిన్లకు పెద్ద ముప్పే పొంచి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.