చేతిలో సూటుకేసుతో ముంబై అంతా తిరిగిన హీరోయిన్!
ఇదంతా ఇప్పుడు. మరి ఒకప్పుడు దీపికా పదుకోణే ఎంటి? అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయి. పరిశ్రమలో ఎలాంటి బ్యాకప్ లేకుండా ఎదిగిన నటి.
నేడు బాలీవుడ్ లో దీపికా పదుకొణే స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అగ్ర హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల తోనూ సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ఐశ్వర్యారాయ్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న భామగా పాపులర్ అవుతుంది. ఆ క్రేజ్ తోనే రణవీర్ సింగ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది.
ఇదంతా ఇప్పుడు. మరి ఒకప్పుడు దీపికా పదుకోణే ఎంటి? అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయి. పరిశ్రమలో ఎలాంటి బ్యాకప్ లేకుండా ఎదిగిన నటి. క్యాలెండర్ గాళ్ల్ గా పాపులర్ అయి సినిమాలకు ప్రమోట్ అయిన నటి. ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కుంది. తాజాగా పద్మావతి ఆ నాటి సన్నివేశాల్ని గుర్తు చేసుకుంది. ఆవేంటో ఆమె మాటల్లోనే..
'కెరీర్ ఆరంభంలో చేతిలో లగేజీ పట్టుకుని ముంబై అంతా తిరిగేదాన్ని. టీనేజర్ గా ఉన్నప్పుడే ముంబై కి వచ్చాను. అప్పటికి సిటీ కూడా పెద్దగా తెలియదు. ఎవరూ స్నేహితులు లేరు. అవకాశాల కోసం చాలా కష్టాలు పడ్డాను. ఉదయం వెళ్తే అర్దరాత్రి వరకూ తిరుగుతూనే ఉండేదాన్ని. చేతిలో సూట్ కేసు..నాతో ఓ క్యాబ్ ఉండేది. క్యాబ్ లోనే నిద్రపోయేదాన్ని. మరోవైపు ఇంట్లో వాళ్ల టెన్షన్ .
నేను క్షేమంగా ఉన్నానా? లేదా? అని అమ్మనాన్నలు బెంగపెట్టుకునేవారు' అని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ఎవరికీ సొంతం కాదు. అందులోనూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి ఎన్నో ఎళ్లు పడుతుంది. ఈ ప్రోసస్ లో రకరకాల కష్టనష్టాలు..సవాళ్లు..అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నింటి దీపిక అధిగమించింది. అందుకే నేడు అంత గొప్ప స్థానంలో ఉంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉందో తెలిసిందే. వృత్తి..వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సంతోషంగా ముందుకు తీసుకెళ్తుంది.