ఎర్ర మిర్చి ఘాటులా.. దీపిక గ్లామర్ ట్రీట్​

తాజాగా ఈమె టాప్ టు బాటమ్​ రెడ్​ కలర్ ఫుల్ స్లీవ్​ లాంగ్​ ​ డ్రెస్​లో​ ఎర్ర మిర్చి ఘాటులా మెరిసిపోతూ పోజులిచ్చింది. అందరి చూపు తనపైనే పడేలా అంతా మ్యాచింగే ధరించింది.

Update: 2023-10-21 12:13 GMT

బాలీవుడ్ స్టార్ హీరోయిన్​గా రాణిస్తోంది అందాల భామ దీపికా పదుకొణె. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ పొడుగు సుందరి.. ప్రస్తుతం బాలీవుడ్​లో చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అంతే కాదు ఎప్పుడూ తన ఫ్యాషన్ సెన్స్​తో అందరినీ కట్టిపడేస్టుంటుంది. తాజాగా టాప్ టు బాటమ్​ రెడ్​ కలర్​ డ్రెస్​లో​ రాయల్ లుక్​లో మెరిసిపోతూ చూపుతిప్పుకోకుండా చేసింది.


వివరాళ్లోకి వెళితే.. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. సౌత్ ఇండస్ట్రీలో అంతగా సినిమాలు చేయకపోయినా.. ఈ ముద్దుగుమ్మకు ఇక్కడా కూడా మస్త్ క్రేజ్ ఉంది. త్వరలోనే కల్కి : 2898 ఏడీ (Project K)లో ప్రభాస్​తో కలిసి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.

సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్​గా ఉంటుంది దీపిక. ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. బ్రాండ్ ప్రమోషన్స్​ కూడా చేస్తుంటుంది. అలా ఈ సొట్టబుగ్గల సుందరి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకుంది. ఆమె పెట్టిన ఏ పోస్టు అయినా నెట్టింట క్షణాల్లోనే వైరల్​గా మారుతుంటుంది.

తాజాగా ఈమె టాప్ టు బాటమ్​ రెడ్​ కలర్ ఫుల్ స్లీవ్​ లాంగ్​ ​ డ్రెస్​లో​ ఎర్ర మిర్చి ఘాటులా మెరిసిపోతూ పోజులిచ్చింది. అందరి చూపు తనపైనే పడేలా అంతా మ్యాచింగే ధరించింది. గ్లాసీ రెడ్​ హీల్స్​, కాస్ట్లీ సిల్వర్ జ్యువెలరీ, బోల్డ్ షేడ్​ రెడ్ కలర్ నెయిల్ పాలిష్, రెడ్ లిప్​ స్టిక్​ వేసుకుని మెస్మరైజ్ చేసింది. ఇవన్నీ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఆమె స్టైల్​ అండ్ ఫ్యాషన్ సెన్స్​ను బాగా చూపించాయి.

గతంలోనూ పలుసార్లు ఇలా టాప్ టు బాటమ్ రెడ్ కలర్ డ్రెస్సుల్లో మెరిసింది దీపిక. రెడ్ కార్పెట్​పై ర్యాంప్ వాక్ కూడా చేసింది. ఇంకా ఎన్నో రకాల ఔవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేసి ట్రెండ్ సెట్ చేసింది. అలాగే సంప్రదాయ దుస్తుల్లోనూ అట్రాక్ట్ చేసింది. బికినీలోనూ గ్లామర్ మెరుపులూ మెరిపించింది. మత్తు చూపులు, మత్తెక్కించే పోజులతో తన అభిమానులను మైమరిపించింది.

Tags:    

Similar News