హాట్ బ్యూటీ తీరని కోరకలు..భారం పెరుమాళ్లపైనే!
తాజాగా అమ్మడు తనలో నెగిటివ్ యాంగిల్ ని కూడా మేకర్స్ తీసుకోవాలని సూచించింది.
హాట్ బ్యూటీ ప్రియమణి అటు సినిమాలు..ఇటు టెలివిజన్ రెండింటా దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చిన ఏ అవకాశం విడిచిపెట్టడం లేదు. చిన్న..పెద్ద అనే తేడా లేకుండా సినిమాలకు ఎలా కమిట్ అవుతుందో? టీవీ షోల్ని సైతం అలాగే హోస్ట్ చేస్తుంది. ఆ రకంగా అమ్మడు ఆదాయానికి ఎలాంటి కొదవ లేదు. రెండు చేతులా సంపాదనే కనిపిస్తుంది. హీరోయిన్ గా ఫేడౌట్ అయిన తర్వాత ఎలాంటి పాత్రలకైనా సై అంటూ దూసుకుపోతుంది. తాజాగా అమ్మడు తనలో నెగిటివ్ యాంగిల్ ని కూడా మేకర్స్ తీసుకోవాలని సూచించింది.
ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. `వెంకటేశ్ గారితో ఒక సినిమా చేయాలనే కోరిక చాలా కాలంగా ఉండేది. ఆయన ఏదైనా ఫంక్షన్ లో ఎదురుపడినా నా మనసులోని మాటను ఓపెన్ గా చెప్పేసేదాన్ని. అలాంటి నా ముచ్చట `నారప్ప` సినిమాతో తీరిపోయింది. వెంకటేశ్ గారు చాలా పెద్ద స్టార్ . అయినా ఆయన సెట్లో చాలా సింపుల్ గా ఉండేవారు. అందరితోనూ సరదాగా మాట్లాడేవారు. ఇంతవ రకూ నేను చాలా పాత్రలను పోషించాను.
అయితే నాన్ స్టాప్ గా నవ్వించే పాత్రను చేయాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ఇక పవర్ఫుల్ విలన్ రోల్ చేయాలనే కోరిక కూడా బలంగా ఉంది. అలాంటి ఛాన్స్ ఎప్పుడు? వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పాత్రల విషయంలో నాకెంలాంటి కండీషన్లు లేవు. నమ్మి అవకాశం కల్పించిన దర్శకుల్ని సంతృప్తి పరచడమే నాపని. అందుకే ఇప్పటికీ సినిమాలు చేయగల్గుతున్నాను. కొన్ని డ్రీమ్ రోల్స్ ఉన్నా యి. నన్ను తెరపై ఫలానా పాత్రలో చూసుకోవాలని ఎప్పటి నుంచి కలలు కంటున్నాను.
అలాంటి అవకాశం వస్తుందన్న నమ్మకం నాలో ఉంది. ఆ నమ్మకంతోనే ఇంకా సినిమాలు చేయలగ్గు తున్నాను` అని తెలిపింది. ప్రియమణి రెండు దశాబ్ధాలుగా ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే. తతెలుగెతో పాటు తమిళ..హిందీ..కన్నడ భాషల్లోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది.