దేవర-2 అవసరమా అంటూ క్వశ్చన్లు.. మేకర్స్ మాత్రం కష్టపడాల్సిందే..

పార్ట్ 2 మూవీలో యాక్షన్ తక్కువ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Update: 2025-01-08 03:00 GMT

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో గతేడాది దేవర పార్ట్-1 ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఆ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌ గా నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేశాయి.

అయితే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.500 కోట్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది దేవర. కానీ బెనిఫిట్ షో తర్వాత నెగిటివిటీ అందుకుంది. ఆ తర్వాత మాస్ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో నెగిటివిటీ అధిగమించి మంచి విజయం సాధించిందనే చెప్పాలి. అదే సమయంలో సినీ ప్రియులను అంచనాలు మాత్రం అందుకోలేదని కొందరు అభిప్రాయపడ్డారు.

ఓటీటీలోకి వచ్చాక మూవీపై ఫుల్ ట్రోల్స్ వచ్చాయని చెప్పాలి. ఎక్కడా ఏ మిస్టేక్ జరిగిందో క్లియర్ గా ఐడెంటిఫై చేసిన సినీ ప్రియులు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరు బ్యాడ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. సినిమాకు సీక్వెల్ అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీంతో సీక్వెల్ రద్దు అయిందని ఆ మధ్య ఊహాగానాలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం దేవర-2 స్క్రిప్ట్ వర్క్ ను చేస్తున్నారు కొరటాల శివ. తన పవర్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పార్ట్ 2 మూవీలో యాక్షన్ తక్కువ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 2025 జూలై నుంచి సెట్స్ మీదకు సినిమాకు తీసుకెళ్లి, 2026లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో ఇప్పటికీ కొందరు సీక్వెల్ నిజంగా అవసరమా అని అని క్వశ్చన్ చేస్తున్నారు. పార్ట్-2 చాలా బాగుంటుందని ఇప్పటికే మేకర్స్ చెప్పినప్పటికీ.. తమకు ఇంట్రెస్ట్ లేదని అంటున్నారు. టైం వేస్ట్ అని.. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కోసం రెండేళ్లు వృథా చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో వాళ్లకు సీక్వెల్ నచ్చాలంటే కొరటాల శివ బాగా కష్టపడాల్సిందే.

తొలి భాగంలో జాన్వీ తన యాక్టింగ్ తో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఆమె రోల్ కు స్కోప్ లేదని అన్నారు. రెండు పేజీల డైలాగ్ అంటూ ప్రమోషన్స్ లో చెప్పినది ఎక్కడుందని అప్పట్లో కామెంట్లు పెట్టారు. దీంతో హీరోయిన్ విషయంతోపాటు అన్ని విషయాల్లో మేకర్స్ తమ వర్క్ తో మెప్పించాలి. అప్పుడే సీక్వెల్.. ఫస్ట్ పార్ట్ కన్నా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News