దేవర కలెక్షన్స్… తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే షేర్ ఎంతంటే?
ఇక శని, ఆదివారాల్లో కూడా ‘దేవర’ మూవీకి భారీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అనే మాట మేకర్స్ నుంచి వినిపిస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాల జాబితాలో ఒకటిగా ‘దేవర’ ఉంటుందనే మాట ఫ్యాన్స్ నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి వస్తోన్న టాక్ పట్ల మేకర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ‘దేవర’ మూవీ సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసిన మేకర్స్ ప్రేక్షకులందరికి థాంక్స్ చెప్పారు. ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
ఇక శని, ఆదివారాల్లో కూడా ‘దేవర’ మూవీకి భారీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అనే మాట మేకర్స్ నుంచి వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా 140+ కోట్ల కలెక్షన్స్ ని ‘దేవర’ మూవీ మొదటి రోజు వసూళ్లు చేసిందనే టాక్ నడుస్తోంది. దీనిపై అధికారికంగా మేకర్స్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. అర్ధరాత్రి బెన్ ఫిట్ షోల నుంచి మొదటి రోజు లాస్ట్ షో వరకు తెలుగు రాష్ట్రాలలో దేవర మూవీని చూడటానికి అత్యధిక మంది తరలివెళ్లారు. చాలా వరకు థియేటర్స్ హౌస్ ఫుల్ పడ్డాయి.
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో ‘దేవర’ మొదటి రోజు ఏకంగా 54.21 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది సెకండ్ హైయెస్ట్ షేర్ ని ‘దేవర’ మూవీ అందుకుందని తెలిపారు. ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో మొదటి రోజు ఏకంగా 19.32 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ వసూళ్లు చేసింది. వైజాగ్ ఏరియాలో 5.47 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది.
గుంటూరులో 6.27 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా, నెల్లూరులో 2.11 కోట్లు వచ్చాయి. ఇక కృష్ణా 3.02 కోట్లు, ఈస్ట్ గోదావరి 4.02 కోట్లు, వెస్ట్ గోదావరి 3.60 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ వసూళ్లు చేసింది. సీడెడ్ లో 10.40 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 54.21 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ‘దేవర’ మూవీ మొదటి రోజు సాధించింది.
రెండవ రోజు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. దసరా హాలిడేస్ కూడా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
నైజాం - 19.32 కోట్లు
వైజాగ్ - 5.47 కోట్లు
గుంటూరు - 6.27 కోట్లు
నెల్లూరు - 2.11 కోట్లు
కృష్ణా - 3.02 కోట్లు
తూర్పు గోదావరి - 4.02 కోట్లు
పశ్చిమ గోదావరి - 3.60 కోట్లు
సీడెడ్ - 10.40
రెండు తెలుగు రాష్ట్రాల ఓవరాల్ షేర్ - 54.21 కోట్లు