దేవర కలెక్షన్స్.. పుష్ప 2 కూడా గట్టిగానే..
ఫస్ట్ డే ఓపెనింగ్స్ అనేది ఏ సినిమాకైనా చాలా కీలకమని చెప్పాలి.
ఫస్ట్ డే ఓపెనింగ్స్ అనేది ఏ సినిమాకైనా చాలా కీలకమని చెప్పాలి. సినిమాపై ఏ రేంజ్ బజ్ క్రియేట్ అయ్యిందనేది ఫస్ట్ డే కలెక్షన్లు డిసైడ్ చేస్తాయి. మొదటి రోజు కలెక్షన్లు ఎక్కువ వస్తే, అది సినిమాకి పాజిటివ్ వైబ్ తీసుకొస్తుంది. అందుకే పాన్ ఇండియా సినిమాల మొదటి రోజు కలెక్షన్లను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారు. తెలుగు పాన్ ఇండియా సినిమాలకు మొదటి రోజే ఈజీగా 150 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తున్నాయి.
ఈ ఏడాది విడుదలైన ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమాకి మొదటి రోజు ఏకంగా 180 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇండియన్ బాక్సాఫీస్‌లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ఇకపోతే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ ఇటీవలే విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
ఈ ఏడాది ఫస్ట్ డే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా దేవర నిలిచింది, ఇది నిజంగా రేర్ ఫీట్ అని చెప్పాలి. ఇదే స్పీడ్‌లో శని, ఆదివారాలు కూడా భారీ కలెక్షన్లు అందుకోవడం గ్యారెంటీ అని మేకర్స్ భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో తప్ప, నార్త్‌లో పెద్దగా బజ్ లేదు. అయినప్పటికీ, రిలీజ్ ముందు కొంత వరకు నార్త్ ఇండియన్ ఆడియన్స్‌కు చేరువైంది. దీంతో నార్త్ ఇండియాలో దేవర మూవీ 8 కోట్ల వరకు కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లతో ఇప్పుడు పుష్ప 2 మేకర్స్ చాలా జోష్‌లో ఉన్నారనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకు ముఖ్యమైన కారణం ఉంది. దేవర సినిమా మినిమమ్ బజ్‌తోనే ఏకంగా 150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుష్ప 2 చిత్రంపై నార్త్ ఇండియాలో భారీ హైప్ ఉంది. కచ్చితంగా ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
దేవర ఫస్ట్ డే కలెక్షన్లను చూసిన తర్వాత, పుష్ప 2 మొదటి రోజే అంతకుమించి అనేలా గ్రాస్ కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమాపై ఉన్న హైప్ అలాగే కొనసాగితే, ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డును సైతం పుష్ప 2 అధిగమించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మన తెలుగు పాన్ ఇండియా సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో దేవర కలెక్షన్లు ప్రూవ్ చేశాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి పుష్ప 2 ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.