దేవర ట్రైలర్ లాంచ్… ఎక్కడంటే?

సెప్టెంబర్ 10న దేవర మూవీ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముంబైలో ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందంట.

Update: 2024-09-07 04:52 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ దేవర సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మూడు సాంగ్స్ రిలీజ్ కాగా వాటన్నింటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపైన అంచనాలు పెరిగాయి.

 

రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ ని షురూ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. ట్రైలర్ రిలీజ్ తో ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నారంట. సెప్టెంబర్ 10న దేవర మూవీ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముంబైలో ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందంట. భారీ ఎత్తున ఈ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ పాల్గొంటారంట. అలాగే కీలక యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా అటెండ్ కాబోతున్నారని తెలుస్తోంది. ట్రైలర్ రిలీజ్ సందర్భంగానే మీడియా మీట్ కూడా నిర్వహించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇక మూవీ ట్రైలర్ 2 నిమిషాల 45 సెకండ్స్ నిడివితో ఉంటుందంట. అదిరిపోయే రేంజ్ లో ట్రైలర్ ని ఇప్పటికే కొరటాల రెడీ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల మాట.

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఎన్టీఆర్ మీద దేవర సినిమాపై హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే 350-400 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగిందంట. మొదటి రోజు ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నార్త్ అమెరికాలో దేవర మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించారంట. స్పెషల్ ప్రీమియర్స్ షోలకి బుకింగ్స్ జరుగుతున్నాయంట.

ఈ సినిమాకి అత్యంత వేగంగా 15000 టికెట్లు నార్త్ అమెరికాలో బుక్ అయ్యాయంట. ఇప్పటి వరకు ఇంత వేగంగా ఏ ఇండియన్ సినిమాకి టికెట్స్ బుక్ కాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మరింత జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మొదటి రోజు దేవర మూవీ వరల్డ్ వైడ్ గా 100-150 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News