పుష్ప 2, ఓజీ ల కంటే 'దేవర' కే ఎక్కువ...!

తాజాగా ORMAX అనే మీడియా సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Update: 2024-08-21 01:30 GMT

బాలీవుడ్‌ సినిమాలు ఒక వైపు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ ఉంటే మరో వైపు టాలీవుడ్‌ సినిమాలు మాత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేస్తూ ఉన్నాయి. ఈ ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్‌ సినిమాల కంటే కూడా ఎక్కువ క్రేజ్‌ కలిగిన కొన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి. వాటిల్లో దేవర మరియు పుష్ప 2 లు ముందు ఉంటాయి. ఆ తర్వాత జై హనుమాన్‌, ఓజీ సినిమాలు ఉన్నాయి. తాజాగా ORMAX అనే మీడియా సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సోషల్‌ మీడియాలో జరిగే చర్చ ఆధారంగా ORMAX మీడియా సంస్థ సినిమాలకు సంబంధించిన మరియు హీరో హీరోయిన్స్ కి సంబంధించిన సర్వే ను నిర్వహించడం జరుగుతుంది. తాజాగా ఈ మీడియా సంస్థ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితా పై సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే లో అత్యధికులు దేవర సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా తమ ఎంపికను తెలియజేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా అవ్వడంతో దేవర పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించడం వల్ల కూడా దేవర సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నాడు. అక్టోబర్‌ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వచ్చే నెల నుంచి షురూ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. ORMAX మీడియా సంస్థ చేసిన సర్వేలో మొదటి స్థానంను దేవర సొంతం చేసుకోగా, తదుపరి స్థానంలో పుష్ప 2 నిలిచింది.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన పుష్ప 2 సినిమా షూటింగ్‌ ఆలస్యం వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. పుష్ప 1 భారీ విజయం నేపథ్యంలో పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సాహో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉండటంతో మూడో స్థానంలో నిలిచింది. ఓజీ సినిమా షూటింగ్‌ లో పవన్ త్వరలో జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి.

Tags:    

Similar News