యంగ్ టైగర్ కెరీర్ లోనే తొలిసారి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవర
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ 'దేవర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ మాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా కొరాటాల మార్క్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభ మైంది. దీనిలో భాగంగా పీటర్ హెయిన్స్..కెన్నీ బేట్స్ లాంటి ప్రఖ్యాత హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.
దీంతో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో అంచనా వేయోచ్చు. ప్రేక్షకుల ఊహకందని విధంగా భారీ పోరాట సన్నివేశాలున్నట్లు 'దేవర' హైలైట్ అవుతోంది. కొన్ని నెలలుగా హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకూ మొత్తం ఐదు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. వాటన్నింటిలోనే 'దేవర' పోరాట సన్నివేశాలే ప్రధానంగా తెరకెక్కించారు. తాజాగా కొత్త యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. శంషాబాద్ లో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది.
దీంతో సినిమాకి సంబంధించి పోరాట సన్నివేశాలు మొత్తం పూర్తవుతాయి. అయితే ఈ రకమైన అనుభవం తారక్ తొలిసారి అని తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా యాక్షన్ తో పాటు టాకీ పార్టు షూటింగ్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా విషయంలో కొరటాల ముందుగా యాక్షన్ సన్నివేశాలపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఇలా తారక్ ఇంత వరకూ ఏ సినిమాకి పనిచేయలేదు. రెండు దశాబ్ధాలుకు పైగా పరిశ్రమలో కొనసాగుతున్నారు. 30కి పైగా సినిమాలు చేసారు.
'ఆర్ ఆర్ ఆర్' లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో పాల్గొన్నారు. చేసిన సినిమాలన్నీ యాక్షన్-టాకీ షూట్ లో కలిపి పాల్గొనేవారు. కానీ 'దేవర' విషయంలో యాక్షన్ వన్ వేలో జరిగిపోతుంది. మధ్యలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా పూర్థి స్థాయిలో యాక్షన్ సన్నివేశాలపైనే టీమ్ పనిచేస్తుంది.
పోరాటాలు క్లైమాక్స్ కి చేరుకోవడంతో కొరటాల సన్నధం అవుతున్నారు. ఇప్పటివరకూ యాక్షన్ కొరియోగ్రఫీ దే కీలక పాత్ర కావడంతో కొరటాల వాటి రివ్యూ పైనే దృష్టి పెట్టి పనిచేసారు. ఆగస్టు మిడ్ నుంచి కొరటాల టాకీ పార్టు షురూ చేయనున్నారని తెలుస్తోంది.