దేవర ఫినిషింగ్ టచ్.. హై వోల్టేజ్ యాక్షన్

'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'

Update: 2024-01-09 13:09 GMT

'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోకి అనూహ్య స్పందన లభించింది. అంతేకాదు ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే ఉంటే ఈ గ్లింప్స్ వీడియోలో ఎన్టీఆర్ ఒక్కరే కనిపించారు. హీరోయిన్ కానీ, విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కానీ కనిపించలేదు. నెక్స్ట్ సినిమా నుంచి రానున్న టీజర్ లో వీళ్ళ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న దేవర త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ని జరుపుకొనుంది. ఈ షెడ్యూల్లో హీరో, విలన్ పై భారీ ఫైట్ సీన్ ని చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ కూడా వేస్తున్నారట. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తానికే బిగ్గెస్ట్ ఫైట్ గా ఉంటుందని అంటున్నారు.

హీరో, విలన్ మధ్య ఫైట్ అంటే ఇదే దేవర పార్ట్-1 క్లైమాక్స్ ఫైట్ కూడా అయ్యుండొచ్చు అని కొందరు చెబుతున్నారు. కానీ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ యాక్షన్ సీన్స్ లో విజువల్స్ మాత్రం చాలా వైల్డ్ గా ఉంటాయట. జస్ట్ గ్లింప్స్ లోనే రక్తంతో సముద్రాన్ని ఎరుపెక్కించిన కొరటాల దేవర కోసం ఏ రేంజ్ లో క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

అన్నట్టు ఈ సినిమాలో ఫైట్స్ ని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ డిజైన్ చేస్తున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్న ఈసినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News