దేవర విషయంలో ఫ్యాన్స్ భయం అదేనా..!
కొరటాల శివ ముఖ్యంగా హిందీ ఆడియన్స్ లక్ష్యంగా దేవర తెరకెక్కిస్తున్నారట.
ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా మీద ఫ్యాన్స్ అంతా కూడా భారీ అంచనాలతో ఉన్నారు. కొరటాల శివ కూడా ఈ సినిమాతో ఎలాగైనా సరే హిట్టు కొట్టి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తో తన మీద ఒక బ్లాక్ మార్క్ ఏర్పరచుకున్న కొరటాల శివ దాన్ని పోగొట్టుకునేందుకు దేవర విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సినిమా అంటే ఉండే అంచనాలు తెలిసిందే. వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలను ఈ సినిమాలో పెడుతున్నారట.
అయితే RRR తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్ అంతకుముందు నేషనల్ వైడ్ గా రేసులో దిగింది లేదు. తారక్ నటించిన సినిమాలు హిందీలో డబ్ అయ్యి హిట్ అయ్యాయి కానీ డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది మాత్రం ట్రిపుల్ ఆర్ సినిమానే
అయితే అప్పటికే అక్కడ ఎన్టీఆర్ కి మంచి ఫ్యాన్స్ బేస్ ఉండటం ఆర్.ఆర్.ఆర్ లో భీమ్ పాత్ర వాళ్లకు కనెక్ట్ అవ్వడం సినిమా హిట్ కు కారణం అయ్యాయి. ఈ క్రమంలో దేవర సినిమా తో ఎన్టీఆర్ మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు.
దేవర సినిమా కథ తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఉన్నా దాన్ని నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ అయ్యేలా చేయడానికి కొరటాల శివ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రాసుకున్నారట. ఇందుకు గాను అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టరైజేషన్, ఆ సినిమా రిఫరెన్స్ లు కొన్ని ఉదహరణగా తీసుకున్నా తప్పులేదని చెప్పొచ్చు. ఒక్కసారి బీ టౌన్ ఆడియన్స్ క్యారెక్టర్ కి కన్విన్స్ అయ్యి వాళ్లకి ఎక్కితే మాత్రం సినిమా ఫలితం వాళ్లే చూసుకుంటారు.
కొరటాల శివ ముఖ్యంగా హిందీ ఆడియన్స్ లక్ష్యంగా దేవర తెరకెక్కిస్తున్నారట. తెలుగు స్టేట్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా తారక్ అటెంప్ట్ ని మెచ్చి తీరుతారు. కానీ బీ టౌన్ ఆడియన్స్ మాత్రం వాళ్లు ఇప్పటివరకు చూడని ఒక కొత్త క్యారెక్టరైజేషన్ అద్భుతాలు ఆశిస్తారు. అటు ఇటుగా దేవర విషయంలో కొరటాల శివ అలానే ప్లాన్ చేస్తున్నాడట.
ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న కొరటాల శివ మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. 2015 టెంపర్ తర్వాత నుంచి తన టెంపర్ చూపిస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటున్న తారక్ దేవరతో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి.