దేవరకి అదిరిపోయే డీల్?
మూవీ నాన్ థీయాట్రికల్ రైట్స్ 130 నుంచి 140 కోట్ల వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. నవంబర్ ఆఖరుకి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి పెట్టాలని కొరటాల చూస్తున్నారు. ఈ మూవీతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది, సైఫ్ ఆలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం కొరటాల శివ చేస్తున్నారు. ఫిక్షనల్ కాన్సెప్ట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర సినిమా ఉండబోతోంది. కథ ఏంటి అనేది కొరటాల శివ ఇప్పటికే చెప్పేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో చాలా ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత తారక్ నుంచి రాబోయే పాన్ ఇండియా సినిమా ఇదే కాబట్టి దేశ వ్యాప్తంగా హైప్ ఉంటుంది. ఈ చిత్రంతో హిందీలో తారక్ కి ఎలాంటి మార్కెట్ క్రియేట్ అయ్యిందనేది తేలిపోతుంది. దీని తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ జూనియర్ ఎన్టీఆర్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మూవీ నాన్ థీయాట్రికల్ రైట్స్ 130 నుంచి 140 కోట్ల వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషలకి కలుపుకొని డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ కోసం పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయంట. భారీ మొత్తంలో రైట్స్ కోసం ఆఫర్ చేస్తున్నాయంట. అనిరుద్ మ్యూజిక్ అందిస్తూ ఉండటం కూడా సినిమా రైట్స్ కి డిమాండ్ పెరగడానికి కారణం అయ్యింది.
తాజాగా సూపర్ స్టార్ జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ అనిరుద్ కి దక్కింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం అనిరుద్ మ్యూజిక్ కారణంగానే జైలర్ మూవీ సూపర్ సక్సెస్ అయ్యిందని ప్రశంసించారు. ఇప్పుడు దేవర సినిమాకి కూడా కాన్సెప్ట్ బట్టి అంతకు మించి మ్యూజిక్ ని అనిరుద్ నుంచి ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.