దేవర రైట్స్ వారికే.. జస్ట్ చిన్న బేరం పెండింగ్!

నందమూరి కళ్యాణ్ రామ్ సహా పలువురు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Update: 2024-06-04 05:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతోంది. తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. బీ టౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సహా పలువురు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఫియర్ సాంగ్ ను ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయగా.. మ్యూజిక్ లవర్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే నార్త్ టు సౌత్.. భారీ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే వేసవిలో రిలీజ్ అవ్వాల్సిన ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా వేశారు మేకర్స్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఇప్పుడు జోరుగా నెట్టింట చర్చ జరుగుతోంది. దేవర తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకున్నట్లు టాక్ వినిపించింది. టిల్లు స్క్వేర్ ఈవెంట్ లో ఎన్టీఆర్, త్రివిక్రమ్, నాగవంశీ కలిశారు. అప్పుడే డీల్ సెట్ అయిందని అన్నారు.

అదే సమయంలో నాగవంశీ పోస్ట్ పెట్టారు. బయట వస్తున్న వార్తలను నమ్మవొద్దని ట్వీట్ చేశారు. దీంతో దేవర రైట్స్ సితార దక్కించుకుందని వస్తున్న వార్తలపై స్పందించి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సితార సంస్థనే దేవర రైట్స్ దక్కించుకుందని తెలుస్తోంది. చిన్న విషయం తప్ప ఆల్మోస్ట్ డీల్ ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం. అగ్రిమెంట్ పూర్తవ్వగానే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్. అది కూడా త్వరలోనేనట.

మొత్తానికి సితార సంస్థ టాలీవుడ్ లో దూసుకుపోతోంది. వరుస చిత్రాలను నిర్మిస్తూ మంచి హిట్లు అందుకుంటోంది. అదిరిపోయే లాభాలు చేజిక్కించుకుంటోంది. ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లైనప్ వేరే లెవల్ లో ఉంది. ఇప్పుడు దేవర హక్కులు దక్కించుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ మూవీతో ఎలాంటి లాభాలు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News