చాలామంది స్వార్థంతో ఆలోచిస్తారు: దేవి శ్రీ ప్రసాద్
టాలీవుడ్ లో ఆల్ టైమ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.
టాలీవుడ్ లో ఆల్ టైమ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ లలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. దేవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు దాటిపోయింది. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. బ్లాక్ బస్టర్ సినిమాలలో భాగం అయ్యాడు. ఆయన నుంచి చాలా వరకు యునిక్ ట్యూన్స్ వస్తూ ఉంటాయి.
అప్పుడప్పుడు అతనిపై కూడా కాపీ ట్యూన్ విమర్శలు వచ్చాయి. అయితే ఎక్కువగా ట్రోలింగ్ కి గురైన సందర్భాలు లేవని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి క్లాస్, మాస్, డివోషన్ బీట్స్ అన్ని వస్తాయి. కంటెంట్ ని అర్ధం చేసుకొని దర్శకులు అడిగిన దానికంటే బెస్ట్ ట్యూన్స్ దేవిశ్రీ ప్రసాద్ ఇస్తాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. అందుకే స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు చాలా మంది దేవిశ్రీ ప్రసాద్ తో వర్క్ చేయడానికి ఇష్టపడతారు.
కానీ పుష్ప 2 విషయంలో కొన్ని ఊహించని పరిస్థితులు ఎదుర్కొన్నట్లు టాక్ వచ్చినప్పటికీ పుష్ప 2లో దేవి అవుట్ పుట్ చూశాక ప్రశంసలు దక్కాయి. BGM కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయని చెప్పాలి. ఈ సాంగ్స్ సినిమా పైన హైప్ క్రియేట్ చేశాయి. ఇక మూవీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
పుష్ప 2లోని శ్రీలీలపై చిత్రీకరించిన ఐటెం సాంగ్ కిస్సిక్ సెన్సేషన్ హిట్ అయ్యింది. ఈ పాటలోని లిరిక్స్ కూడా ట్రెండ్ కి తగ్గట్లుగా ఉండటంతో అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సాంగ్ సిచువేషన్ ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ పంచుకున్నారు. ఈ కిస్సిక్ అనే పదం సినిమాలో ఉంది. సుకుమార్ గారు ఈ విషయం చెప్పగానే చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. అదే పదంతో పాటని ప్రారంభించాలని అనుకున్నాను. నేను మ్యూజిక్ ట్యూన్ గురించి ఆలోచిస్తూ యాదృశ్చికంగా హమ్ చేసాను. అది సుకుమార్ గారికి బాగా నచ్చేసింది. దానినే ఫైనల్ చేశారు. అలా ఈ కిస్సిక్ సాంగ్ ట్యూన్ రెడీ అయ్యింది. ఇది మాత్రమే కాదు. చాలా సినిమాలకి నేను చేసిన మొదటి ట్యూన్ ని దర్శకులు ఒకే చేసేస్తూ ఉంటారు. ఒక సాంగ్ కోసం ఎక్కువ ట్యూన్స్ కంపోజ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
కెరియర్ లో ఇప్పటి వరకు ఎవరి ట్యూన్స్ కాపీ చేయలేదని దేవిశ్రీ ప్రసాద్ చెప్పాడు. ఇతరుల సాంగ్స్ ని కాపీ చేయకూడదు అనే సూత్రాన్ని నేను కచ్చితంగా ఫాలో అవుతానని అన్నారు. చాలా మంది ఇంకొకరి అవకాశాన్ని ఎలా సొంతం చేసుకోవాలా అనే స్వార్ధంతో ఆలోచిస్తూ ఉంటారు. అయితే నైతికంగా అవి కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. అందుకే ఇతరుల అవకాశాలు హైజాక్ చేయాలని నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు.
ఓ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం తనని సంప్రదించారు. అయితే అప్పటికే వారు వేరొక మ్యూజిక్ డైరెక్టర్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు. అతను సరిగా చేయడం లేదని నా దగ్గరకి వచ్చారు. నేను చేయనని వారికి మొహం మీదనే చెప్పాను. మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం కలిసి పనిచేసినపుడు ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ మోరల్స్ కి కట్టుబడి ఉన్నందుకు నన్ను అభినందించారు. కెరియర్ ప్రారంభంలో ఇంగ్లీష్ సాంగ్స్ ట్యూన్స్ ని కాపీ చేసి కొత్త పాటలు చేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. అయితే నేను దానికి పూర్తిగా విరుద్ధమని వారికి చెప్పాను. నా టాలెంట్ ని మాత్రమే నేను నమ్ముకున్నాను అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు.