అల్లుడు అవ్వాల‌ని అప్పుడే డిసైడ్ అయ్యాడా?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మాజీ అల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-07-08 17:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మాజీ అల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీ కుమార్తె ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ -ధనుష్ ల వివాహం 2004 లో జ‌రిగింది. కొన్నేళ్ల కాపురం అనంత‌రం క‌ల‌త‌లు చోటు చేసుకోవ‌డంతో ఇటీవ‌లే విడిపోయారు. అయితే ధ‌నుష్ కెరీర్ కూడా 2004 లో ప్రారంభ‌మైంది. న‌టుడిగా, గాయ‌కుడిగా , గీత ర‌చయిత‌గా అనుభవం ఆయ‌న సొంతం. త‌మిళ ద‌ర్శ‌కుడు క‌స్తూరి రాజా వార‌సుడిగా ధ‌నుష్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.

కానీ న‌టుడిగా ట్యాలెంట్ తోనే ఎదిగాడు. తండ్రి వార‌స‌త్వం అన్న‌ది కేవ‌లం ఎంట్రీ కార్డు వ‌ర‌కే. అటుపై అతడు అంత పెద్ద స్టార్ గా ఎదిగాడంటే? కార‌ణం అత‌డిలో ప్ర‌తిభ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జీవితంలో ఎద‌గాల‌ని ధ‌నుష్ 16 ఏళ్ల వ‌య‌సులోనే నిర్ణ‌యించుకున్నాడు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇంటి ప‌క్క‌నే త‌న‌కు ఓ ఇల్లు ఉండాల‌ని మైన‌ర్ గా ఉన్న‌ప్పుడే బ‌లంగా మ‌న‌సులో పునాది వేసాడు.

అలాగే ఎదిగి చూపించాడు. ఆ సంగ‌తేంటో చూద్దాం. `ర‌జ‌నీకాంత్ గారి ఇల్లు పోయేస్ గార్డెన్ లో ఉంటుంది. దాన్ని 16వ ఏట చూడ‌టం కోసం వాచ్ మ్యాన్ ని బ్ర‌తిమ‌లాడి లోప‌లికి వెళ్లాను. అప్పుడే ఇల్లు క‌ట్టుకోవాల‌ని డిసైడ్ అయ్యా. స‌రిగ్గా రెండేళ్ల క్రిత‌మే 150 కోట్ల‌తో అక్క‌డే ఇల్లు క‌ట్టుకున్నాను. అది నాకు న‌చ్చిన ఎంతో గొప్ప ఇల్లుగా చెబుతాను. ఇండస్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కున్నాను. అందులో ర‌క‌ర‌కాల ద‌శ‌లున్నాయి.

బాడీ షేమింగ్ కి గుర‌య్యాను. వీడేంటి ఇంత బ‌క్క‌గా ఉన్నాడు? సినిమాల‌కు ప‌నికొస్తాడా? అనేవారు. స‌క్సెస్ అయిన త‌ర్వాత ర‌క‌ర‌కాల చెడ్డ పేరు, తెచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. వెన్నుపోటు అంటూ ఎంతో మంది విమ‌ర్శించారు. కానీ వేటిని ప‌ట్టించుకోలేదు. ల‌క్ష్యం వైపే ప్ర‌యాణం మొద‌లు పెట్టి ముందు కెళ్లాను` అని అన్నారు.

Tags:    

Similar News