ఆ మ్యూజిక్ డైరెక్టర్ బయోపిక్ ధనుష్ చేస్తే..?
ఒకవేళ ఆ తరహాలో లేకపోతే మాత్రం సినిమాలు చేసినప్పటికీ కూడా ఆడియెన్స్ పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.
బయోపిక్ సినిమాలు గత రెండు మూడేళ్ల క్రితం గట్టిగానే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ రూట్లో సినిమాలు చేసేందుకు ఓ వర్గం హీరోలు కొంత వెనుకడుగు వేస్తున్నారు. రియాలిటీ కథలు అయినప్పటికీ కూడా అందులో సినిమాటిక్ పాయింట్స్ ఎక్కువగా ఉంటేనే జనాలు ఆసక్తిని చూపిస్తున్నారు. మరీ కమర్షియల్ ఫార్మాట్ లో కాదు కానీ బయోపిక్ అంటే ట్విస్టులు లేదా హై ఎమోషన్స్, కాస్త హీరోయిక్ ఎలివేషన్స్ కు తగ్గట్టుగా సంఘటనలు ఉంటే క్లిక్ అయ్యే అవకాశం ఉంటోంది.
ఒకవేళ ఆ తరహాలో లేకపోతే మాత్రం సినిమాలు చేసినప్పటికీ కూడా ఆడియెన్స్ పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఒకవేళ కథలో కావాలని ఫేక్ ఎలివేషన్స్ ఇచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయితే ఇప్పుడు ధనుష్ కొత్తగా హీరో ఎలివేషన్స్ లేని బయోపిక్ చేయడానికి ఆసక్తి లంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మ్యూజిక్ ప్రపంచంలో ఎన్నో మధురమైన పాటలను అందించిన ఇళయరాజా జీవితాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆ కథపై ధనుష్ ఆసక్తి గా ఉన్నట్లు సమాచారం. ఒక విధంగా ఇళయరాజా జీవితంలో కాంట్రవర్సీలు పెద్దగా లేకపోయినప్పటికీ ఆయన ఎదుగుదల అలాగే మ్యూజిక్ ప్రపంచంలో ఆయన క్రియేట్ చేసిన మ్యాజిక్ ను అద్భుతంగా ఉండవచ్చు.
కానీ దాన్ని వెండితెరపై చూపిస్తే నేటితరం ఆడియన్స్ థియేటర్లోకి వచ్చి చూస్తారా లేదా అనేది మరొక పెద్ద సందేహం. అయితే ధనుష్ కు ఇలాంటి ప్రయోగాలంటే చాలా ఇష్టం అతని కెరీర్ లో కొన్ని మాస్ ఎలివేషన్ లేని సినిమాలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి. ఇక ఇళయరాజా సంగీత జీవితంలో ధనుష్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? దాన్ని మేకర్స్ ఎలా తెరపైకి తీసుకు వస్తారు అనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ ఓటీటీ ప్రాజెక్టు తరహాలో వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన కూడా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రాజెక్టు విషయంలో మేకర్స్ ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి. 2024లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఇక ఏడాది లోపం పూర్తిచేసి 2025లో ఇళయరాజా బయోపిక్ స్క్రీన్ పై తీసుకురావాలని అనుకుంటున్నారు.