కుభేర… ధనుష్ లుక్కుతోనే షాక్ ఇస్తున్నాడే..

లవ్ స్టోరీ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుభేర అనే సినిమా చేస్తున్నారు.

Update: 2024-07-28 08:00 GMT

శేఖర్ కమ్ముల అంటే వెంటనే ప్రేమకథాచిత్రాలు ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఆయన సక్సెస్ లు అందుకున్నది కూడా వాటితోనే. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు ఆయన నుంచి చివరిగా వచ్చాయి. ఈ రెండు కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. అలాగే లీడర్ లాంటి కథలు కూడా పర్ఫెక్ట్ గా చెప్పగలను అని నిరూపించుకున్నాడు. లవ్ స్టోరీ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుభేర అనే సినిమా చేస్తున్నారు.


ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. కింగ్ నాగార్జున కూడా మరో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతున్నారు. మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే స్టార్ హీరో ధనుష్ బర్త్ డే సందర్భంగా కుభేర మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లుక్ లో మాసిన గెడ్డం, మురికిపట్టిన బట్టలతో ధనుష్ కనిపిస్తున్నాడు. ఆ లుక్ లో కూడా ఏదో బాధలో ధనుష్ ఎక్స్ ప్రెషన్ ఉంది. ధనుష్ కెరియర్ లో ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ తెలియజేసింది.

టైటిల్ బట్టి చూస్తుంటే మూవీ కాన్సెప్ట్ డబ్బు చుట్టూ తిరిగేలా ఉంది. మోస్ట్ అండరేటెడ్ గా ధనుష్ క్యారెక్టర్ ఈ చిత్రంలో ఉంటుందని పోస్టర్ లుక్ బట్టి అర్ధమవుతోంది. ఇప్పటికే రష్మిక మందన క్యారెక్టర్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ధనుష్ క్యారెక్టర్ లుక్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ పోస్టర్ తో సినిమా మీద అంచనాలు భారీగా క్రియేట్ చేసారని చెప్పొచ్చు. బాలీవుడ్ యాక్టర్ జిమ్ సరభ్ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

శేఖర్ కమ్ముల నుంచి మొదటి సారిగా ప్రేమకథ కాకుండా డిఫరెంట్ జోనర్ మూవీ వస్తోంది. దీంతో కుభేర మూవీలో కచ్చితంగా ఏదో కొత్త అంశాన్ని శేఖర్ కమ్ముల చూపించబోతున్నాడనే టాక్ పబ్లిక్ లో ఉంది. ఆయన సినిమాలలో కథ కంటే క్యారెక్టర్స్ జర్నీ చాలా ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ధనుష్ లుక్ చూస్తుంటే సామాన్యులకి కూడా రీచ్ అయ్యే కాన్సెప్ట్ ని చెప్పబోతున్నారని అనిపిస్తోంది.

Tags:    

Similar News