ఆ హీరో ట్రిపుల్ అదిరిపోతుందా!
ధనుష్ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు - హిందీ వెర్షన్‌లలో కూడా తొలి లిరికల్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది.
కోలీవుడ్ స్టార్ ధనుష్ సక్సెస్ ట్రాక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అతడికి పాన్ ఇండియాలో క్రేజ్ ఉంది. డిఫరెంట్ కంటెంట్ తో ..వైవిథ్యమైన పాత్రలతో మార్కెట్ లో తనదైన బ్రాండ్ వేసేసాడు. ధనుష్ నుంచి కొత్తగా ఎలాంటి ఎక్స్ పెరిమెంట్ వస్తుందా? అని ఎదురుచూసేలే ఓ ఐడెంటిటీ సంపాదించుకున్నాడు. అందుకు తగ్గట్టే ధనుష్ కంటెంట్ హిట్ అవుతుంది. తాజాగా 'రాయన్' చిత్రాన్ని ఆయన స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం కూడా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అంచనాలు పీక్స్ కి చేరాయి. ధనుష్ ఇంటెన్స్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా లిరికల్స్ తోనూ శ్రోతల్ని అలరించడానికి రెడీ అయ్యారు. ఏకంగా ధనుష్ అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ ఇస్తున్నాడు. రాయన్ నుండి మొదటి సింగిల్ రెడీ అయింది. ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నారు.
ధనుష్ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టి లో పెట్టుకుని తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు - హిందీ వెర్షన్‌లలో కూడా తొలి లిరికల్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. తమిళ వర్షన్ 'అడంగాత అసురన్' అంటూ పాట మొదలవుతుంది. తెలుగులో 'తల వంచి ఎరగడే' అంటూ పాట రాబోతుంది. అలాగే హిందీలొ 'కోయి తోడ్ నా ఇస్కా' ట్రాక్ తో మొదలవుతుంది. ఈపాట తమిళ వెర్షన్‌ను ధనుష్ స్వయంగా రాశారు.
ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందించడం పెద్ద అస్సెట్. ఈ పాటకి ప్రత్యేకంగా ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా వ్యవరించారు. చాలా కాలం తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాట కావడంతో ఆ సెక్షన్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పాట ఎలా ఉండబోతుంది? రెహమాన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారా? ప్రభుదేవా కొరియోగ్రఫీతో మళ్లీ రచ్చ చేయడం ఖాయమేనా? అంటూ ఒకటే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తోంది.