ధనుష్ తో కమ్ములా అంత ఈజీ కాదు!
తొలిసారి శేఖర్ కమ్ములా తన సేఫ్ జోన్ వదిలి బయటకు వచ్చి చేస్తున్న ప్రయత్నం.
కోలీవుడ్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ములా `కుబేర` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ముంబై గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు భాగం కావడంతో పాన్ ఇండియా లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే ధనుష్ డిఫరెంట్ లుక్ సైతం రివీల్ చేసారు. తొలిసారి శేఖర్ కమ్ములా తన సేఫ్ జోన్ వదిలి బయటకు వచ్చి చేస్తున్న ప్రయత్నం.
ముంబై మాఫియా నేపథ్యాన్ని ఎంచుకుని సినిమా చేయడం గానీ...ఆ జానర్ ని గానీ ఇంతవరకూ టచ్ చేయలేదు. దీంతో కమ్ములా పెద్ద ప్రయోగం చేస్తున్నాడనే ప్రచా రం గట్టిగానే జరుగుతుంది. అయితే ఇది శేఖర్ కమ్ములా వరకూ ప్రయోగం గా భావించినా ధనుష్ కి మాత్రం ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడక లాంటివి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ప్రయోగాలు ఇప్పటికే ధనుష్ ఎన్నో చేసాడు.
తన స్టార్ డమ్ ని పక్కనబెట్టి ఓ నటుడిగా ఎన్ని రకాల పాత్రలు చేయాలో అన్నీ టచ్ చేసాడు. రెండు దశాబ్ధాల సినీ ప్రయాణంలో స్టార్ హోదా ఉన్న పాత్రలతో పాటు ఎలాంటిఇమేజ్ లేని పాత్రలు సైతం చేసాడు. కోలీవుడ్ లో ఆ రకమైన పాత్రలు సైతం చేసిన ఒకే ఒక్క నటుడు ధనుష్. తాను సూపర్ స్టార్ గా ఎదగడానికి కారణం కూడా ఇమేజ్ చట్రంలో ఉండకుండా సినిమాలు చేయడమేనని విశ్లేషకులు చెబు తుంటారు.అలాంటి ధనుష్ తో శేఖర్ కమ్ములా తాను ఓ ప్రయోగాత్మకంగా ఓ సినిమా చేస్తున్నాడు.
పాన్ ఇండియా వైడ్ ఫలితం పక్కనబెడితే! తమిళ అభిమానుల్ని ఇలాంటి పాత్రలతో మెప్పించడం అన్నది అంత సులభం కాదు. నేపథ్యం..పాత్ర అంతా కొత్తగా ఉంటనే అక్కడ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ప్రస్తుతం తమిళ దర్శకుల కథల్లో ఎంత లోతైన విశ్లేషణ ఉంటుందో తెలిసిందే. కంటెంట్ సహా పాత్ర ఏమాత్రం రొటీన్ గా ఉన్నా ప్రేక్షకులు పెదవి విరచేస్తారు. `వారసుడు` విషయంలో అభిమానుల నుంచి తలపతి విజయ్ ఇలాంటి అనుభవన్నే ఎదుర్కున్నాడు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని శేఖర్ కమ్ములా కుబేర తెరకెక్కిస్తున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు.