ధనుష్ నోట్లోంచి ఊడిపడినట్లే యాత్ర!
ధనుష్-ఐశ్వర్య వేర్వేరుగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు విడిపోయినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.
ధనుష్-ఐశ్వర్య వేర్వేరుగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు విడిపోయినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే ఇటీవలే ధనుష్ నటించిన `కెప్టెన్ మిల్లర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ధనుష్ కుమారులు ఇద్దరితో కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. ధనుష్ తమిళ సంప్రదాయంలో ఎప్పటిలాగే తెల్ల పంచె..షర్ట్ ధరించి వేడుకు విచ్చేసారు. పెద్ద కుమారుడు లింగ... చిన్న కుమారుడు యాత్ర కూడా హాజరయ్యారు.
ఇకఇద్దరు కుమారుల మధ్యలో ధనుష్ కూర్చున్నాడు. ధనుష్ కి కుడిపైపున చిన్న కుమారుడు లింగ కూర్చోగా.. ఎడమవైపున యాత్ర కూర్చున్నాడు. తండ్రితనయుల్ని అలా చూడానికి రెండు కళ్లు సరిపోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ ప్రేమ్ ఎంతో అందంగా కనిపించింది. సరిగ్గా ఇదే యాంగిల్ లో తల్లి ఐశ్వర్య పక్కన కుమారులు ఇద్దరు కూర్చున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన `లాల్ సలామ్` ఆడియో వేడుక రెండు రోజుల క్రితం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఆవేడుకకు తల్లితో కలిసి యాత..లింగ కూడా హాజరయ్యారు. అప్పుడు తండ్రి పక్కన ఎలాంటి డైరెక్షన్ లో కూర్చున్నారో..ఇప్పుడు తల్లి పక్కన కూడా పిల్లలు ఇద్దరు అలాగూ కూర్చున్నారు. ఆ రెండు ఫోటోలు పక్క పక్కన పెట్టి చూస్తుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. ఇక పెద్ద కుమారుడు యాత్ర అయితే తండ్రి ధనుష్ కి అచ్చు గుద్దినట్లే ఉన్నాడు. ధనుష్ పీచర్స్ తోనే దిగిపోయాడు.
ధనుష్ నోట్లోంచి ఉడిపడినట్లే ఉన్నాడు. ముక్కు.. .చెవులు..మూతి..కళ్లు..హెయిర్ స్టైల్..కూర్చునే స్టైల్ అన్ని ధనుష్ ని మరిపించాడు. తండ్రి లాగే తనయుడు ఎంతో సింపుల్ గా ఉన్నాడు. ఇక చిన్న కుమారుడు లింగా పోలికలు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. హెయిర్ స్టైల్ సహా ముఖంలో చాలా పీచర్స్ చేంజ్ ఉన్నాయి. ఈ రెండు ఫోటోల్ని పరిశీలిస్తే ధనుష్ ఉన్న పిక్ లో ఐశ్వర్య లేదు..ఐశ్వర్య ఉన్న పిక్ లో ధనుష్ లేడు. అంతే తేడా. అంతకు మించి ఆ రెండు ఫోటోల్లో ఎలాంటి మార్పు లేదు.