దియా మీర్జా పార్ట్ టైమ్ ప్రోఫిషన్!
అవకాశాలు వస్తున్నా తప్పని పరిస్థితుల్లో పార్ట్ టైమ్ నటిగా కొనసాగాల్సి వస్తోంది. నాకు అంతకు మించి వేరే మార్గం కనిపించడం లేదు. ప్రస్తుతం యుఎన్ఈబీ రాయబారిగా కొనసాగుతున్నా.
పదేళ్ల క్రితం వరకూ బాలీవుడ్ లో బిజీ బీజీ గా గడిపిన దియా మీర్జా వేగం ఒక్కసారిగా తగ్గిన సంగతి తెలిసిందే. అటు పై అమ్మడు వివాదాస్పద అంశాల పై స్పందించడం...సామాజిక దృక్కోణం లో ఎక్కువగా హైలైట్ అయింది.
చేతి లో సినిమాలు లేకపోయే సరికి అమ్మడు కొత్త పంథాలో వ్యవహారించి మీడియాలో హాట్ టాపిక్ గా మారేది. ఈ క్రమంలో దియా కొన్ని రకాల బాధ్యతలు తీసుకుని వాటిని నిర్వర్తించే పని లో పడింది. తాజాగా అమ్మడి కెరీర్ జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వేంటో ఆమె మాటల్లోనే.
'నటన పై ఆసక్తి ఉన్నా..అవకాశాలు వస్తున్నా తప్పని పరిస్థితుల్లో పార్ట్ టైమ్ నటిగా కొనసాగాల్సి వస్తోంది. నాకు అంతకు మించి వేరే మార్గం కనిపించడం లేదు. ప్రస్తుతం యుఎన్ఈబీ రాయబారిగా కొనసాగుతున్నా. ఐక్యరాజ్య సమితి తరుపున పనిచేయడం ఓ బాధ్యతగా భావిస్తున్నా. ఇటీవల యుఎన్ఈబీ అధినేత భారత్ కి వచ్చినప్పుడు ఇదే విషయం చెప్పాను. పర్యావరణాన్ని సంరక్షించుకోవడం అత్యంత అవసరమైన కార్యక్రమం.
దీని పై తప్పకుండా పనిచేస్తా. ఆ దిశగా కొన్ని ప్రణాళికలు సిద్దం చేసి పెట్టుకున్నా. దాంతో పాటు ఎదుగుతోన్న నా పిల్లల్ని దృష్టి లో పెట్టుకుని నేను నడుచుకోవాల్సి ఉంది. వాళ్ల మెరుగైన భవిష్యత్ కి బాట వేయడం తల్లిగా నా బాధ్యత. ఇలా ఇన్ని బాధ్యతలు నాపై ఉన్నాయి. అందుకే సినిమాల కు పూర్తి స్థాయి లో సమయం కేటాయించలేకపోతున్నా. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు.
సినిమాల్లో బిజీ అయితే క్షణం తీరిక సమయం దొరకదు. షూటింగ్ ఇల్లు తప్ప మరే ఇతర పనులు చేయలేం. కుటుంబం..పర్యావరణం మించి ఏదీ ముఖ్యం కాదని సినిమాల్ని లైట్ తీసుకున్నా. ఇక పై నా లో ఇంకా చాలా మార్పులు రావొచ్చు' అని తెలిపారు. ప్రస్తుతం దియా మీర్జా - తాప్సీ నిర్మాణం లో తెరకెక్కుతోన్న 'ధక్ ధక్' అనే చిత్రంలో నటిస్తోంది. దియా మీర్జా హైదరాబాద్ కి చెందిన నటి అన్న సంగతి తెలిసిందే.