5 ఏళ్ళ వయసుకే ఇంటి నుంచి పారిపోయిన నటి
పాపులర్ హైదరాబాదీ నటి.. మాజీ మిస్సు.. కానీ చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయింది. ఆ తర్వాత తన లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తుకు ఎదుగుతానని ఆమె ఊహించి ఉండదు.
పాపులర్ హైదరాబాదీ నటి.. మాజీ మిస్సు.. కానీ చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయింది. ఆ తర్వాత తన లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తుకు ఎదుగుతానని ఆమె ఊహించి ఉండదు. ఇంతకీ ఎవరా కథానాయిక? అంటే.. పేరు దియా మీర్జా. 2000లో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ గా అయిన దియా తన మొదటి సినిమాతోనే రాత్రికి రాత్రే కీర్తిని సంపాదించింది. బెంగాలీ తల్లి -జర్మన్ తండ్రికి జన్మించిన ఈ బ్యూటీ తన సవతి తండ్రి ఇంటిపేరును ఉపయోగిస్తుంది.
దియా మీర్జా హైదరాబాద్‌లో జన్మించింది. తన తండ్రి ఫ్రాంక్ హ్యాండ్రిచ్ జర్మన్ గ్రాఫిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెయిర్ డిజైనర్, ఆర్కిటెక్ట్, ఆర్టిస్ట్ మరియు ఇంటీరియర్ డిజైనర్ అయితే ఆమె తల్లి దీప బెంగాలీ ఇంటీరియర్ డిజైనర్ అండ్ ల్యాండ్‌స్కేపర్. దియా మీర్జా 5 సంవత్సరాల వయస్సులో తన తండ్రితో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయింది. తండ్రి కోపంతో తనపై గట్టిగా అరిచాడు.. ఆ తర్వాత అమాయకురాలైన చిన్నారి దియా ఇల్లు వదిలి తన బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే ఆ తర్వాత తిరిగి తండ్రి వెతుక్కుంటూ వచ్చాడు. ఇకపై చిట్టి దియాపై కోపం తెచ్చుకోనని హామీ ఇచ్చాడు. సినిమాల్లోకి రాకముందు దియా మీర్జా ఒక మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేది. దాని కోసం నెలకు రూ. 5000 జీతం అందుకునేది.
దియాకు నాలుగున్నరేళ్ల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన తల్లి హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మీర్జా అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. తన తల్లి పెళ్లి తర్వాత దియా తన సవతి తండ్రి ఇంటిపేరును స్వీకరించింది. అతడు 2004లో మరణించాడు.
2001లో ఆర్ మాధవన్‌తో కలిసి దియా మీర్జా తొలి చిత్రం `రెహనా హై తేర్రే దిల్ మే` సూపర్ హిట్. ఈ చిత్రం బాలీవుడ్‌లోని అత్యుత్తమ రొమాంటిక్ చిత్రాలలో ఒకటి. ఈ సినిమాలో దియా పాత్రతో ప్రేమలో పడిన ప్రజలు `పర్ఫెక్ట్ గర్ల్‌ఫ్రెండ్` అనే ట్యాగ్‌ని కూడా ఇచ్చారు. దీని తరువాత దీవానాపన్-తుమ్కో నా భూల్ పాయేంగే-దమ్-పరిణీత-లగే రహో మున్నాభాయ్-సంజు వంటి చిత్రాలలో కనిపించింది. వ్యక్తిగత జీవితం గురించి తరచి చూస్తే.. తన మొదటి భర్త నుండి విడిపోయిన తర్వాత దియా 2021లో వైభవ్ రేఖీని రెండవ వివాహం చేసుకుంది. జూలై 2021లో దియా మగబిడ్డ అవ్యాన్ ఆజాద్ రేఖీకి స్వాగతం పలికింది. వైభవ్ రేఖీకి మొదటి వివాహం నుండి సమైరా రేఖి అనే కూతురు కూడా ఉంది.