సంక్రాంతిలో గేమ్ ఛేంజర్ .. ఓ క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు
దిల్ రాజు మాట్లాడుతూ, "ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 'గేమ్ ఛేంజర్' సినిమా కోసం మొదట క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావించాము.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. మొదట ఈ సినిమాను డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్లాన్ మారింది. ఫైనల్ గా రిలీజ్ కు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అధికారికంగా ప్రకటించారు.
దిల్ రాజు మాట్లాడుతూ, "ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 'గేమ్ ఛేంజర్' సినిమా కోసం మొదట క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావించాము. కానీ వివిధ భాషలలో డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చించిన తర్వాత, సంక్రాంతి సీజన్ అయితే బెస్ట్ అని అనిపించింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి, యూవీ క్రియేషన్స్ టీంకు తెలియజేశాను.
ఈ సినిమా కోసం మూడేళ్లుగా పెద్ద బడ్జెట్ తో పని చేస్తున్నందున, ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరవలసిన సినిమా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాము" అన్నారు. అలాగే, "విశ్వంభర" సినిమా కూడా పెద్ద బడ్జెట్ తో రూపొందుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతి రిలీజ్ గా ప్రకటించారు. కానీ మా సినిమాకి ఈ డేట్ కావాలని అనుకుంటే చిరంజీవి గారు మరియు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ వెంటనే అంగీకరించారు.
'విశ్వంభర' సినిమా షూటింగ్ డిసెంబర్ లో పూర్తవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అపుడే పూర్తి కానుంది. అయినప్పటికీ, వాళ్ళు 'గేమ్ ఛేంజర్' సినిమాకు సంక్రాంతి సీజన్ ను మాకు ఇవ్వడానికి వేరే డేట్ కు షిఫ్ట్ అయ్యారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫైనల్ గా 'గేమ్ ఛేంజర్' సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఫ్యాన్స్, సినిమా ప్రేమికులకి ఇది పెద్ద పండుగలా ఉండనుంది. మా టీం మొత్తం సినిమా కోసం బాగా కష్టపడుతోంది.
ఇప్పటివరకు వచ్చిన రెండు పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. టీజర్ త్వరలో విడుదల చేస్తాం, అలాగే మిగిలిన మూడు పాటలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. మా సినిమా రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్డమ్ ని మరింత పెంచుతుందని, 'గేమ్ ఛేంజర్' ని ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయ్యేలా తీసుకెళతామనే నమ్మకం ఉంది" అని వివరణ ఇచ్చారు.