నాని సినిమాతో బిగ్ డీల్ ఆయనకు కాస్త రిస్కే!
ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు.
నేచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు సక్సెస్ లు అందుకొని జోరుమీద ఉన్నారు. ప్రస్తుతం 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఆగష్టు 29న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేస్తోన్న సెకండ్ మూవీ ఇది కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ లో “అంటే సుందరానికి” మూవీ వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు.
ఈ సారి వివేక్ ఆత్రేయ యాక్షన్ కథతో సరిపోదా శనివారం మూవీ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ నైజాం రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
చాలా కాలం తర్వాత దిల్ రాజు నైజాంలో డిస్టిబ్యూటర్స్ గా 'సరిపోదా శనివారం' సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి గతంలో నైజాం అంటే దిల్ రాజు పేరు ప్రముఖంగా వినిపించేది. ఎంత పెద్ద సినిమా అయిన ఆయనని దాటి వెళ్ళేది కాదు. అలాగే దిల్ రాజు కూడా నిర్మాతగా కంటే డిస్టిబ్యూటర్ గానే ఎక్కువ లాభాలు అందుకున్నారు. సినిమాల సక్సెస్ ని దిల్ రాజు చాలా ఈజీగా కేలిక్యులేట్ చేస్తారనే అభిప్రాయం ఉంది.
అయితే గత కొంతకాలంగా దిల్ రాజుకి డిస్టిబ్యూటర్ గా కలిసి రావడం లేదు. జైలర్ సినిమా అతనికి డిస్టిబ్యూటర్ గా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తరువాత ఏ మూవీ కూడా ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వలేదు. ఇదే సమయంలో నైజాంలో దిల్ రాజుకి పోటీగా మైత్రీ మూవీ మేకర్స్ వారు వచ్చారు. దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాకి ఏకంగా 200 కోట్ల పెట్టుబడి పెట్టారు. అలాగే వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా కోసం కూడా 60 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారంట.
నితిన్ - వేణు శ్రీ రామ్ తమ్ముడు సినిమా కూడా సెట్స్ పైన ఉంది. ఇలా సినిమాల నిర్మాణం కోసం ఎక్కువ ఖర్చు చేయడంతో డిస్టిబ్యూటర్ గా పెద్ద సినిమాలతో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఒత్తిడితో కూడుకున్న పని. సరిపోదా శనివారం సినిమా ఫ్యాన్సీ ధరకి నాన్ రిఫండబుల్ బేస్ లో దిల్ రాజు తీసుకున్నారంట. ఇది రిస్క్ అయిన కూడా నాని మార్కెట్, అతని స్టోరీ సెలక్షన్ మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజ ధైర్యం చేసారంట. మరి అతని నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందనేది వేచి చూడాలి.