2015లోనే చెప్పాను.. సిద్ధు పెద్ద హీరో అవుతాడని
ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో అతిథి బాబి మాట్లాడుతూ.. సిద్ధు జొన్నలగడ్డ పెద్ద హీరో అవుతాడని కొన్నేళ్ల క్రితమే తాను చెప్పానని గుర్తు చేసారు.
సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. నాగవంశీ నిర్మాత. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో అతిథి బాబి మాట్లాడుతూ.. సిద్ధు జొన్నలగడ్డ పెద్ద హీరో అవుతాడని కొన్నేళ్ల క్రితమే తాను చెప్పానని గుర్తు చేసారు.
వేదికపై దర్శకుడు బాబి మాట్లాడుతూ-''టిల్లు స్క్వేర్ ట్రైలర్ చాలా బావుంది.. సిద్ధు గురించి చెప్పాలంటే నాకు అతడితో ఒక స్పెషల్ మూవ్ మెంట్ ఉంది. 2016లో సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రీకరణ జరుగుతోంది. దేవీశ్రీ దగ్గర తోబా తోబా పాట రికార్డింగ్ ముగించి వస్తున్నా. ఆ సమయంలో ఏదో మ్యాగజైన్ పేజీలు తిరగేస్తుంటే, ఒక చిన్న కాలమ్ లో సిద్ధు ఫోటో చూశాను. ఈ అబ్బాయి బావున్నాడు. కళ్లు బావున్నాయి.. ఒకసారి ఆఫీస్ కి పిలపించండి అన్నాను. ఫిలింనగర్ లో ఆఫీస్ కి వచ్చాడు సిద్ధు. సర్ధార్ గబ్బర్ సింగ్ లో కళ్యాణ్ గారితో ఒక రోల్ ఉంటుందని అనుకున్నాడు. తనను చూడగానే హీరోగా షైన్ అవుతాడనిపించింది. ఆ రోజు ఏదో ఒక వేషం వేస్తానని అతడు అనుకున్నాడు. కానీ నువ్వు ఏదో ఒక రోజు పెద్ద హీరో అవుతావు సిద్ధూ అని అన్నాను. సర్ధి చెప్పి పంపించేసాను.. ఆ రత్వాత డీజే టిల్లు ఈవెంట్లో కలిసాం. తనే మళ్లీ గుర్తు చేసాడు. ఆరోజు నేను అన్న మాటను. జనరల్ గా ఇలాంటివి మర్చిపోతుంటాం'' అని అన్నారు.
మా ఇంట్లో పిల్లలు సిద్ధూ సినిమా డిజే టిల్లు పాటల్ని ఎంతగానో ఆస్వాధిస్తారు. ట్రైలర్ చూశాను.. సీక్వెల్ లోను హాస్యం మొదటి భాగం కంటే బావుంటుంది. ఇది డబుల్ బొనాంజ లా ఉంది. మా నిర్మాత నాగవంశీని రెగ్యులర్ గా సెట్లో కలుస్తుంటాను. బాలయ్య బాబు 109 సినిమా కూడా వారు చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్రయూనిట్ కి గేయ రచయితలు అందరికీ ఆల్ ది బెస్ట్.. అని అన్నారు. సిద్ధూ మునుముందు బాబీ దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని కూడా హింట్ ఇచ్చాడు.