టెంప్ట్ చేస్తున్న దిశా ప‌టానీ బికినీ

బాలీవుడ్ అంద‌గ‌త్తెలు దిశా పటానీ -మౌని రాయ్ ఇటీవ‌ల థాయ్ ల్యాండ్ లో విహరిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2023-12-26 04:18 GMT

బాలీవుడ్ అంద‌గ‌త్తెలు దిశా పటానీ -మౌని రాయ్ ఇటీవ‌ల థాయ్ ల్యాండ్ లో విహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. గాళ్స్ వీర‌విహారానికి సంబంధించిన‌ ఇన్‌స్టా ఫీడ్ అభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది. వారాంతపు సెల‌వుల‌ను దిశా-మౌని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. క్రిస్మస్ ఈవ్ నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ వ‌రుస పార్టీల‌తో చిలౌట్ అయ్యేందుకు బిగ్ ప్లానింగ్‌తో ఉన్నారు ఈ భామ‌లు. రెండు వారాల పాటు ఆస్వాధ‌న‌ల కోసం థాయిలాండ్‌లోని ఫుకెట్‌కి వెళ్లారు.


ఈ జోడీ త‌మ‌ హాలిడే డైరీ స్నీక్ పీక్ ని షేర్ చేస్తున్నారు. వీటి నుంచి అద్భుత‌మైన ఫోటోగ్రాఫ్స్ బ‌య‌టికి వ‌స్తున్నాయి. దిశా తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో అప్‌లోడ్ చేసిన ఇటీవలి వీడియోలో రెడ్ హాట్ లుక్ అంత‌ర్జాలాన్ని షేక్ చేసింది. ఇంత‌లోనే ఇప్పుడు దిశా పటానీ బీచ్ లో చిల్ చేస్తున్న ఓ ఫోటోగ్రాఫ్ వైర‌ల్ గా మారింది. దిశా బీచ్ ప‌రిస‌రాల్లో అంద‌మైన బికినీ ధ‌రించి స‌ముద్రంలో ఈదేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అయితే ఈ ఫోటోలో దిశా స్ట‌న్నింగ్ గ్లామ్ ఎలివేష‌న్ యూత్ ని క‌వ్విస్తోంది.


కొన్ని నెలల క్రితం మౌని `ది ఎంటర్‌టైనర్స్ టూర్` నుండి దిశాతో క‌లిసి ఉన్న చాలా ఫోటోల‌ను షేర్ చేసింది. ఇప్పుడు అంత‌కుమించి అనిపించేలా బీచ్ వెకేష‌న్ నుంచి హుషారు పెంచే ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో అక్షయ్ కుమార్ ది ఎంటర్‌టైనర్స్ నార్త్ అమెరికా టూర్ సమయంలో దిశా పటానీ - మౌని రాయ్ స్నేహితులు అయ్యారు. ప‌రిశ్ర‌మ‌లో మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.


భామ‌లు ఇరువురూ కెరీర్ ప‌రంగా పూర్తి బిజీగా ఉన్నారు. దిశా పటానీ త‌దుప‌రి భారీ యాక్షన్ డ్రామా `యోధా`లో కనిపించ‌నుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నాతో క‌లిసి న‌టించింది. నాగ్ అశ్విన్ యాక్షన్ డ్రామా కల్కి 2898 ADలో ప్ర‌భాస్, దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కూడా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇమ్రాన్ హష్మీ నటించిన `షోటైమ్` అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. మౌని రాయ్ తదుప‌రి వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. బాబీ డియోల్, అర్జున్ రాంపాల్‌లతో కలిసి మోస్ట్ అవైటెడ్ క్రైమ్ మిస్టరీ చిత్రం పెంట్‌హౌస్‌లో కనిపించనుంది. దేవాంగ్ భావ్‌సర్ కామెడీ థ్రిల్లర్ బ్లాక్అవుట్‌లో తన బహుముఖ ప్రజ్ఞను కూడా ప్రదర్శిస్తుంది. సునీల్ గ్రోవర్, విక్రాంత్ మాస్సేతో కలిసి దిశా న‌టించ‌నుంది. ఇటీవల జియోసినిమాలో డేటింగ్ రియాలిటీ షో `టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా`ను కూడా హోస్ట్ చేస్తోంది.


Tags:    

Similar News