పిక్ టాక్ : ఆ తిండి ఏంటి అమ్మడు?
తెలుగు బిగ్ బాస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి.
తెలుగు బిగ్ బాస్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు, సిరీస్ ల్లో కనిపిస్తూ వస్తుంది. మరో వైపు సోషల్ మీడియాలో కూడా ఈమె అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడు నెట్టింట సందడి చేస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా దక్కాల్సిన ఆఫర్లు దక్కకున్నా కూడా ఈ అమ్మడు నిరుత్సాహ పడకుండా ప్రయత్నాలు చేస్తూ వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
దివి అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఈసారి దివి డెజర్ట్ తింటూ తీసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఏది ఎలా తినాలో అలాగే తినాలి అంటూ ఈ ఫోటోలకు కామెంట్ పెట్టింది.
సాధారణంగా సెలబ్రిటీలు చాలా స్టైల్ గా, క్లాస్ గా తింటారు. ముఖ్యంగా బయటకు కనిపించిన సమయంలో స్పూన్స్ ని వినియోగిస్తూ తినడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ అమ్మడు మాత్రం ఈ స్థాయిలో చేతులకు మరియు మొహానికి అంటే విధంగా తినడంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
ఏదో ఒక విధంగా దివి ఫోటోలు నెట్టింట సందడి చేయడం రెగ్యులర్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందు నడుము నాభి అందాలను చూపించడం ద్వారా వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు ఈసారి డెజర్ట్ తింటూ కూడా వార్తల్లో నిలిచింది. ఏంటి అమ్మడు ఆ తిండి అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.