ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ..రక్తంతో తడిసిన చొక్కాలను క్లీన్ చేసాను!
ఆమె మాట్లాడుతూ- "నా బావ కూడా పోలీస్ ఫోర్స్‌లో ఉన్నారు. ఓ రోజు డోంగ్రీలో ఆపరేషన్ కోసం సమీర్‌తో కలిసి వెళ్లాడు.
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ పార్టీ కేసులో ప్రముఖంగా హైలైట్ అయిన పేరు సమీర్ వాంఖడే. మాజీ ఎన్సీబీ అధికారి వాంఖడే ఖాన్ వారసుడు ఆర్యన్ ని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత ఆర్యన్ పై జరిగిన విచారణలో అతడి తప్పేమీ లేదని ప్రూవ్ అయింది. అంతేకాదు ఆర్యన్ అరెస్ట్ విషయంలో సమీర్ వాంఖడే అతి చేశాడని కూడా విమర్శలొచ్చాయి. సమీర్ వాంఖడేపై ఉన్నత స్థాయి దర్యాప్తు కూడా సాగుతోంది.
ఇలాంటి సమయంలో మాజీ NCB జోనల్ హెడ్ సమీర్ వాంఖడే అతడి భార్య నటి క్రాంతి రెడ్కర్ ఇటీవల అమృత రావు - RJ అన్మోల్ పోడ్‌కాస్ట్ షోలో కనిపించారు. అందులో వారు తమ వ్యక్తిగత జీవితాలు సహా మరెన్నో సంగతులపై ఓపెనయ్యారు. సమీర్ పని గురించి అతడి భార్య క్రాంతి మాట్లాడుతూ తనకు రిస్క్ ఉందని తెలిసి కూడా అతడు ఏదీ ఆలోచించకుండా ఆపరేషన్ నిర్వహిస్తాడని అన్నారు. అలాంటి అధికారిపై ప్రజలు ఆరోపణలు చేసినప్పుడల్లా తాను నిరాశకు గురవుతున్నానని చెప్పారు.
ఆమె మాట్లాడుతూ- "నా బావ కూడా పోలీస్ ఫోర్స్‌లో ఉన్నారు. ఓ రోజు డోంగ్రీలో ఆపరేషన్ కోసం సమీర్‌తో కలిసి వెళ్లాడు. అతను ఇంటికి వచ్చాడు. అతడు మొద్దుబారిపోయాడు. సమీర్‌తో ఇకపై నువ్వు ముందుండి టీమ్ ని నడిపించవద్దని నన్ను చెప్పమని చెప్పాడు" అని తెలిపారు. క్రాంతీ దయచేసి సమీర్‌ని ముందుండి ఇలాంటి చోటికి వెళ్లొద్దని చెప్పండి. ఒక్క బుల్లెట్ సరిపోతుంది. కొంచెం వెనుక ఉండమని చెప్పు. తమతో పాటు రకరకాల ఆయుధాలు పట్టుకుని తిరిగే దుండగుల ముందుకు కూడా దూసుకెళుతుంటాడు" అని అన్నారని క్రాంతి తెలిపారు. "అసమర్థులు సమీర్‌పై దోపిడీలకు పాల్పడినప్పుడల్లా నాకు కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. సమీర్ రక్తంతో తడిసిన షర్టులు, చిరిగిన ప్యాంటు శుభ్రం చేశాను. నేను అతని బూట్లలోని మట్టిని శుభ్రం చేసాను. నేను ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాను. అతని పని అసాధారణమైనది" అని అన్నారు.
అలాగే సమీర్ వాంఖడే తన భార్య అండదండల గురించి మాట్లాడారు. ఎన్‌సిబిలో ఉన్నప్పుడు జీవితంలో కష్టతరమైన దశ గురించి సమీర్ మాట్లాడారు. నిజానికి ఆర్యన్ ఖాన్ వివాదంలో సమీర్ హెడ్ లైన్స్ లోకొచ్చాడు. "ఆ దశ కొనసాగుతున్నప్పుడు క్రాంతి నాతో ఉండటం చూసి నేను చాలా సంతోషించాను. నాకు చావు భయం లేదు.. నాకేదైనా జరిగితే నా కూతుళ్లను ఆదుకునే సత్తా ఉందని క్రాంతికి చెప్పాను. అందుకే నేను కూడా ముందుకెళ్తాను. ఎప్పుడూ ఫ్రంట్ ఫుట్‌లోనే ఉంటాను" అని సమీర్ అన్నారు. సమీర్ వృత్తి కోసం చావుకైనా ఎదురెళతాడని అతడి భార్య క్రాంతి చాలా స్పష్ఠంగా తెలిపారు. కానీ సిన్సియర్ అధికారిపై ఇలా బురద జల్లడం ఆవేదన కలిగించిందని కూడా అన్నారు.