వరల్డ్ కప్ ఫైనల్స్ లో 'డంకీ' ఈవెంట్!
ఈ నేపథ్యంలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. షారుక్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో 'డంకీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
వరల్డ్ కప్ ని బాలీవుడ్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వేదిక భారత్ కావడంతో! బాలీవుడ్ సినిమాల్ని తెలివిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. స్టార్ స్పోర్స్డ్ ఛానెల్స్ తో అగ్రిమెంట్ చేసుకుని కోట్ల రూపాయల పబ్లిసిటీని దక్కించుకుంటున్నారు. ఇప్పటికే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో 'సామ్ బహుదూర్' ప్రచార చిత్రం రిలీజ్ చేసారు. అలాగే టైగర్ -3 ప్రమోషన్ కూడా నిర్వహిస్తున్నారు.
ఈ ప్రచారం కోసం సల్మాన్ ఖాన్ క్రికెట్ వరల్డ్ కప్ కో బ్రాండింగ్ ప్రోమోస్ లోనూ నటించారు. వీటిని కీలక మ్యాచ్ ల మధ్యలో ప్రదర్శిస్తు న్నారు. ఇంకా వరల్డ్ కప్ పూర్తయ్యేలోపు చాలా సినిమాలు కప్ వేదిగా ప్రచారం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. షారుక్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో 'డంకీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
అన్ని పనులు పూర్తిచేసి చిత్రాన్ని డిసెంబర్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మేకర్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. నవంబర్ 19న నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తుదిపోరులో డంకీ చిత్రానికి సంబంధించి ఓ భారీ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారుట. దానికి సంబంధించి యాజమాన్యం స్పోర్స్ట్ ఛానెల్స్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
వేలాది మంది ప్రేక్షకుల మధ్యలో ఈవెంట్ నిర్వహిస్తే ప్రపంచం దృష్టిలో సినిమా పడే అవకాశం ఉంది. తుదిపోరంటే ప్రపంచ వ్యాప్తంగా ఆ మ్యాచ్ అంతా వీక్షిస్తారు. సరిగ్గా ఇదే ఆలోచనతో డంకీ టీమ్ ముందుడుగు వేస్తుంది. అందుకోసం కోట్ల రూపాయలు ప్రచారం ఖర్చుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తుది పోరులో కి భారత్ ప్రవేశిస్తే తిరిగే ఉండదు. డంకీ ప్రచారం తార స్థాయిలోనే ఉంటుంది.
షారుక్ క్రికెట్ కి వీరాభిమాని అని చెప్పాల్సిన పనిలేదు. ఇండియా మ్యాచులన్నీ స్టేడియంలో కూర్చుని చూస్తారు. భారత్ ప్లాగ్ పట్టుకుని ఇండియా అంటూ క్రీడాకారుల్ని ఉత్సాహపరుస్తారు. ఇప్పుడాయన సినిమానే వరల్డ్ కప్ లో ప్రచారం ప్లాన్ చేస్తున్నారు. ఇండియా ఫైనల్ కి వస్తే కింగ్ ఖాన్ ఆపడం ఎవరి తరం కాదు.