2.41 నిమిషాల ట్రైలర్‌తో హైప్ పెరిగేనా?
తాజా సమాచారం మేరకు..డంకీ థియేట్రికల్ ట్రైలర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి పంపగా, నిన్న అంటే నవంబర్ 25న సెన్సార్ వారు U/A సర్టిఫికేట్‌తో ట్రైలర్‌ను క్లియర్ చేసారు.
2023 ముగింపు బాక్సాఫీస్ వద్ద ఘనంగా ఉండబోతోందా? అంటే అవుననే సినీట్రేడ్ విశ్లేషిస్తోంది. దీనికి కారణం డిసెంబర్ లో నువ్వా నేనా అంటూ పోటీపడుతూ పలు భారీ చిత్రాలు విడుదలకు వస్తున్నాయి. ముఖ్యంగా షారూఖ్ డంకీ వర్సెస్ ప్రభాస్ సలార్ పోటీ గురించి బోలెడంత చర్చ సాగుతోంది. ఇంతలోనే రణబీర్ సైతం యానిమల్ తో వేడెక్కిస్తున్నాడు. ఈ నెలలో రిలీజ్ లపై సినీ ప్రేక్షకులకు ఉత్కంఠ నెలకొంది. రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. దీని తరువాత సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీల మొదటి కలయికలో వస్తున్న 'డంకీ' ట్రైలర్ విడుదలకు రెడీ అవుతోంది.
తాజా సమాచారం మేరకు..డంకీ థియేట్రికల్ ట్రైలర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి పంపగా, నిన్న అంటే నవంబర్ 25న సెన్సార్ వారు U/A సర్టిఫికేట్‌తో ట్రైలర్‌ను క్లియర్ చేసారు. సెన్సార్ సర్టిఫికెట్‌లో పేర్కొన్న విధంగా ట్రైలర్ నిడివి 2 నిమిషాల 41 సెకన్లు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సర్టిఫికేట్‌లో దరఖాస్తుదారు - నిర్మాత పేరు సాహిల్ చంద్రమోహన్ ఖోస్లా అని ఉంది. ఒక సోర్స్ ప్రకారం, అతడు రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్‌లో ఒక భాగం. ఈ చిత్రాన్ని కూడా నిర్మించాడు. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు బదులుగా, రాజ్‌కుమార్ హిరాణీ ప్రొడక్షన్ హౌస్ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయించడం ఆసక్తికరం.
ఇంతకు ముందు డంకీ నిర్మాతలు 6 టీజర్‌ల సర్టిఫికేషన్‌ను పొందారు. మొదటి టీజర్ నవంబర్ 2న విడుదలైంది, ఆ తర్వాత నవంబర్ 22న 'లుట్ పుట్ గయా' పాటను విడుదల చేశారు. మిగిలిన ఐదు టీజర్లను డుంకీ మేకర్స్ ఆవిష్కరిస్తారా లేదా నేరుగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తారా అనేది చూడాలి. షారూఖ్ ఖాన్‌తో పాటు, డుంకీలో తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ కూడా నటించారు. ఇది 21 డిసెంబర్ 2023న థియేటర్లలోకి వస్తుంది.