దసరా దర్శకుడు.. అటు తిరిగి ఇటు తిరిగి..
దసరా సక్సెస్ కారణంగా బడా నిర్మాతలు అయితే శ్రీకాంత్ ఒదేలకి అడ్వాన్స్ లు ఇచ్చి ఉన్నారు.
దసరా సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన శ్రీకాంత్ ఒదేల రెండో మూవీ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కినేని అఖిల్ కి కథ చెప్పాడనే ప్రచారం నడిచింది. అయితే అది ఎందుకనో పట్టాలు ఎక్కలేదు. తరువాత చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. దసరా సక్సెస్ కారణంగా బడా నిర్మాతలు అయితే శ్రీకాంత్ ఒదేలకి అడ్వాన్స్ లు ఇచ్చి ఉన్నారు.
కాని హీరోలు మాత్రం అందుబాటులో లేరు. అయితే ఫైనల్ గా మరల శ్రీకాంత్ నేచురల్ స్టార్ నాని దగ్గరకి వచ్చి ఆగాడు. రెండో సినిమాని కూడా నానితోనే చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నానికి శ్రీకాంత్ స్టొరీ నేరేషన్ ఇచ్చి ఒకే చేయించుకున్నాడు అని టాక్. హాయ్ నాన్న రిలీజ్ తర్వాత ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందంట. ఇప్పటికే నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. హాయ్ నాన్న రిలీజ్ తర్వాత పూర్తిస్థాయిలో ఆ మూవీకి నాని కాల్ షీట్స్ కేటాయించాడని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఒదేల సినిమాని పట్టాలు ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారంట.
అయితే వేరే హీరోల డేట్స్ దొరకకపోవడం వలనే ఫైనల్ గా శ్రీకాంత్ ఒదేల నాని దగ్గరకి వచ్చినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాకుండా తనని వంద కోట్ల హీరోగా మార్చిన దర్శకుడు కావడంతో నాని కూడా శ్రీకాంత్ తో సెకండ్ మూవీకి వెంటనే ఒకే చెప్పెసినట్లుగా ప్రచారం నడుస్తోంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ మూవీ అంటే దసరాకి మించి ఎక్స్ పెక్ట్ చేస్తారు.
ఆ స్థాయిలో ప్రాజెక్ట్ ని శ్రీకాంత్ ఒదేల నానికి ఇవ్వగలడా అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. టాలీవుడ్ లో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకులు ద్వితీయ విఘ్నాన్ని అధికమించలేక ఫెయిల్ అవుతారు. మరి శ్రీకాంత్ ఒదేలా ఆ ద్వితీయ విఘ్నాన్ని ఏ మేరకు సక్సెస్ గా మార్చుకుంటాడు అనేది చూడాలి.