స్టార్ హీరోతో దానయ్య డీల్ క్యాన్సిల్.. అసలేమైంది?

RRR సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ చూసిన దానయ్య ఇమేజ్ సౌత్ ఇండియాలో అమాంతంగా పెరిగిపోయింది

Update: 2024-04-22 16:51 GMT

RRR సినిమాతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ చూసిన దానయ్య ఇమేజ్ సౌత్ ఇండియాలో అమాంతంగా పెరిగిపోయింది. ఇక ఆయనతో సినిమాలు చేయాలని చాలామంది అగ్ర హీరోలు అనుకున్నారు. ఇక దానయ్య కూడా మంచి కంటెంట్ ఉన్న కథ దొరికిన తర్వాతనే హీరోలను కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కొంతమంది హీరోలు కథ వినకపోయినా కూడా ఆయనతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

ఇక దానయ్య ముందుచూపుతో కొందరికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా మంచి కంటెంట్ ఉన్న దర్శకులను రంగంలోకి దింపుతూ టేబుల్ ప్రాఫిట్ అందుకునే విధంగా ప్రాజెక్టులు సెట్ చేస్తున్నాడు. ఇక చాలా రోజులుగా దానయ్యతో తమిళ స్టార్ హీరో విజయ్ మధ్యలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముందుగా దర్శకుడు ఎవరు అనే విషయం చర్చల్లోకి రాకపోయినప్పటికీ విజయ్ ఆయనతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు.

బెటర్ కథ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయమని కూడా చెప్పారు. ఇక దానయ్య కొంతమంది దర్శకులను రంగంలోకి దింపినప్పటికీ ఎవరితోనూ పర్ఫెక్ట్ కథ సెట్ అయితే కాలేదు. ఇక ఫైనల్ గా హెచ్ వినోథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి విజయ్ ఒప్పుకున్నాడు. అంతా బాగానే ఉందని ముందుగానే దానయ్య కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న ఆఖరి సినిమా కావడంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.

దీంతో అతను కూడా రెమ్యునరేషన్ గట్టిగానే అడిగాడు. లియో సినిమా వరకు 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న విజయ్ ప్రస్తుతం కొత్త సినిమాలకు అంతకుమించి అడుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఆఖరి సినిమా చేయడానికి దానయ్యతో చేయడానికి విజయ్ దాదాపు 250 కోట్లు అడిగినట్లుగా తమిళ ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపించింది. అయితే ఆ రేంజ్ లో అయితే ప్రాజెక్టు సెట్ అవ్వడం కష్టమని అనుకున్న ఆయన చాలా సార్లు విజయ్ తో కూడా చర్చలు జరిపాడు.

ఇక విజయ్ సైడ్ నుంచి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదట. దీంతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా విజయ్ కూడా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ఇక ఆ ఛాన్స్ మరో నిర్మాణ సంస్థకు ఇవ్వకుండా విజయ్ తన సొంత ప్రొడక్షన్ లో నే ఆఖరి సినిమా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

విలైనంతవరకు కమర్షియల్ గా లాభపడాలి అనే ఆలోచనతోనే విజయ్ ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఇక త్వరలోనే విజయ్ GOAT అనే సినిమాను కూడా ఫినిష్ చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత పొలిటికల్ పార్టీతో బిజీ అయ్యే ముందు వినోథ్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నాడు. ఇక ఆ సినిమాను 2026 లో విడుదల చేయాలని విజయ్ ఆలోచిస్తున్నాడు

Tags:    

Similar News