ఈగల్.. న్యూ లుక్కుతో మాస్ రాజా వైబ్రేషన్స్

ఇక ఈగల్ సినిమాను 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.

Update: 2023-12-04 11:43 GMT

మాస్ మహారాజా రవితేజ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ఈగల్. యాక్షన్ త్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్ కూడా ఇది వరకే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈగల్ సినిమాను 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.


ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ జోరు కూడా పెంచుతుంది. ఇక సినిమాలోని మొదటి పాటను కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఆడు మచ్చ.. అనే ఒక పాటకు సంబంధించిన ప్రోమోను రీసెంట్గా యూట్యూబ్లో విడుదల చేశారు. అంతేకాకుండా రవితేజకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ కూడా విడుదలైంది.

అందులో మాస్ రాజా సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఇంతకుముందు ఎన్నడూ కనిపించిన విధంగా ఒక వైపు మాస్ ఎలిమెంట్ హైలెట్ చేస్తూనే మరొకవైపు యాక్షన్ హావభావాలు కూడా చూపిస్తున్నాడు. రవితేజ నిండు గెడ్డంతో లాంగ్ హెయిర్ తో లుంగీలో చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు అని పోస్టర్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది.

ఇక సాంగ్ లో కూడా అదిరిపోయే స్టెప్పులతో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ పాట థియేటర్లో కూడా విజిల్ వేసే విధంగా ఉంటుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దేవ్ కంపోజ్ చేసిన ఈ పాట ను రాహుల్ సిప్లిగంజ్ పాడారు ఇక ఈ పూర్తి లిరికల్ సాంగ్ ను డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు యూట్యూబ్ ద్వారా విడుదల చేయబోతున్నారు.

తప్పకుండా ఈ ఫుల్ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది అని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇక ఈ సినిమాతో రవితేజ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ప్రతి సినిమాలో ఏదో కొత్త తరహా కథను చెప్పే ప్రయత్నం చేస్తున్న మాస్ రాజా ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ యాక్షన్ ను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

యువదర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గతంలో సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు రవితేజతో చేస్తున్న ఈగల్ సినిమాతో కూడా దర్శకుడుగా అతను మంచి గుర్తింపును అందుకోవాలని కష్టపడుతున్నాడు. ఈగల్ సినిమాను పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి సంక్రాంతిలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News